ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికల ప్రచారంపై మమత కీలక నిర్ణయం

ABN, First Publish Date - 2021-04-19T21:27:29+05:30

కరోనా సెకెండ్ వేవ్ విజృంభిస్తుండటం, పరిస్థితిని చక్కదిద్దవలసి ఉండటంతో ఎన్నికల ప్రచారం..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోల్‌కతా: కరోనా సెకెండ్ వేవ్ విజృంభిస్తుండటం, పరిస్థితిని చక్కదిద్దవలసి ఉండటంతో ఎన్నికల ప్రచారం విషయంలో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ కీలక నిర్ణయం తీసుకున్నారు. కోల్‌కతాలో మమత ఇక ఎన్నికల ప్రచారం చేయరని ఆ పార్టీ ఎంపీ డెరిక్ ఒబ్రెయిన్ ప్రకటించారు. కోల్‌కతాలో ఎన్నికల ప్రచారం చివరిరోజైన 26వ తేదీన కేవలం ఒక సింబాలిక్ మీటింగ్‌ను మాత్రమే మమత నిర్వహిస్తారని ఆయన తెలిపారు. దీనితో పాటు, ఇతర జిల్లాల్లో కేవలం 30 నిమిషాలు మించకుండా మాత్రమే ర్యాలీలు నిర్వహించాలని మమత నిర్ణయించినట్టు డెరిక్ ఒబ్రెయిన్ ఒక ట్వీట్‌లో తెలిపారు.


ఆదివారంనాడు జరిగిన ఎన్నికల ప్రచార సభలో మమత బెనర్జీ సైతం స్వయంగా ఇదే విషయం తెలియజేశారు. ఎన్నికలు జరగాల్సిన చివరి మూడు విడతల్లో భాగంగా కోల్‌కతాలో చిన్న చిన్న మీటింగులను మాత్రమే తమ పార్టీ నిర్వహిస్తుందని, తాను జిల్లాల్లో జరిగే ర్యాలీల్లో స్వల్ప వ్యవధి ప్రసంగాలకే పరిమితం కానున్నానని చెప్పారు. కోవిడ్ పరిస్థితి తీవ్రత దృష్ట్యా తక్కిన మూడు విడతలను ఏకకాలంలో నిర్వహించాలని ఎన్నికల కమిషన్‌కు టీఎంసీ గత వారం విజ్ఞప్తి చేసింది. కోవిడ్ పరిస్థితి దృష్ట్యా పశ్చిమబెంగాల్‌లో తన ప్రచార సభలను రద్దు చేస్తున్నట్టు ఇప్పటికే కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రకటించారు.

Updated Date - 2021-04-19T21:27:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising