ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈసీ బ్యాన్‌పై కోర్టుకెళ్లిన డీఎంకే నేతకు ఎదురుదెబ్బ

ABN, First Publish Date - 2021-04-02T00:48:51+05:30

చెపాక్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా డీఎంకే నేత రాజా సీఎం పళని స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అక్రమ సంబంధ జంటకు పళని జన్మించారని, ప్రీమ్యాచ్యూర్‌గా పుట్టారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీకి చెందిన డాక్టర్ నరేంద్ర

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై: తనపై ఎన్నికల సంఘం విధించిన 48 గంటల నిషేధంపై ద్రవిడ మున్నేట్ర కజగం ఏ.రాజా, మద్రాస్ హైకోర్టును ఆశ్రయించగా అక్కడ కూడా చుక్కెదురైంది. ఆయన వేసిన పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. ఈరోజు ఉదయమే ఎన్నికల కమిషన్ నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం.. రాజాపై 48 గంటల పాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా నిషేధం విధించింది. ఈ ఉత్తర్వులు తక్షణమే అమలులోకి వస్తాయని ఈసీ పేర్కొంది. సీఎం పళని స్వామి తల్లిపై ఆయన చేసిన వ్యాఖ్యలు అసభ్యకరంగా ఉన్నాయని, మహిళల గౌరవాన్ని కించపరిచేట్లుగా ఉన్నాయని ఈసీ అభ్యంతరం తెలిపింది. అంతేకాకుండా ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడమే అవుతుందని కూడా స్పష్టం చేసింది.


చెపాక్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా డీఎంకే నేత రాజా సీఎం పళని స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అక్రమ సంబంధ జంటకు పళని జన్మించారని, ప్రీమ్యాచ్యూర్‌గా పుట్టారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీకి చెందిన డాక్టర్ నరేంద్ర మోదీ ఆయనకు హెల్త్ సర్టిఫికేట్ ఇచ్చారంటూ నోరు పారేసుకున్నారు. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన అన్నాడీఎంకే నేతలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.

Updated Date - 2021-04-02T00:48:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising