ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిజాయితీ రాజకీయాలకు ఓటేయండి: కమల్‌నాథ్

ABN, First Publish Date - 2021-04-17T20:16:39+05:30

నిజాయితీ రాజకీయాలకు ప్రజలు ఓటు వేయాలని మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇండోర్: నిజాయితీ రాజకీయాలకు ప్రజలు ఓటు వేయాలని మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కమల్‌నాథ్ విజ్ఞప్తి చేశారు. దమోహ్ అసెంబ్లీ ఉప ఎన్నిక పోలింగ్ శనివారం ఉదయం ప్ర్రారంభమైంది. ఈ నేపథ్యంలో కమల్‌నాథ్ ఒక ట్వీట్ చేశారు. 'దమోహ్ ప్రజలకు నా విన్నపం. కరోనా మహమ్మారి సమయంలో జరుగుతున్న ఈ ఉపఎన్నికల బలవంతంగా మీ మీద రుద్దారు. భవిష్యత్తులో దమోహ్ ప్రజలు ఏ తరహా రాజకీయాలు కోరుకుంటున్నారనేది ఈ ఎన్నికలు నిర్ణయించనున్నాయి. మీరు నిజాయితీతో కూడిన సచ్ఛీల రాజకీయాలు కోరుకుంటున్నారా, లావాదేవీల రాజకీయాలు కోరుకుంటున్నారా?' అని ఆ ట్వీట్‌లో కమల్‌నాథ్ ప్రశ్నించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే రాహుల్ లోధి గత అక్టోబర్‌లో పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరడంతో దమోహ్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇప్పుడు ఇదే నియోజవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ టాండ్‌న్‌ నిలబడగా, రాహుల్ లోధీ బీజేపి టిక్కెట్‌పై పోటీ చేస్తున్నారు. మే 2న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.

Updated Date - 2021-04-17T20:16:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising