ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సైకిల్‌పై పోలింగ్ బూత్‌కు హీరో విజయ్.. క్లారిటీ ఇచ్చిన టీం

ABN, First Publish Date - 2021-04-06T20:19:43+05:30

చెన్నైలోని తన నివాసం నుంచి సైకిల్‌పై పోలింగ్ బూత్‌కు బయలుదేరారు హీరో విజయ్. ఆయన వెంట తన వ్యక్తిగత భద్రతా సిబ్బందితో పాటు, మరికొంత మంది ద్విచక్ర వాహనాల్లో అనుసరించారు. అయితే కేంద్ర ప్రభుత్వ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కోలివుడ్ టాప్ హీరో విజయ్, పోలింగ్ బూత్‌కు సైకిల్‌పై వచ్చి తన ఓటు వేయడంపై సోషల్ మీడియాలో పెద్ద స్థాయిలో చర్చ జరుగుతోంది. ఒక పార్టీకి వ్యతిరేకంగానే ఆయన ఇలా సైకిల్‌పై వచ్చి ఓటేశారని, ఎవరిని ఓడించాలో చెప్పకనే చెప్పారని నెటిజెన్లు చర్చించుకుంటున్నారు. దేశంలో ఇప్పటికే తీవ్ర స్థాయిలో అధికమై, ఇంకా పెరుగుతూ పోతున్న ఇంధన ధరలకు వ్యతిరేకంగానే విజయ్ ఇలా సైకిల్‌పై వచ్చారని అంటున్నారు. విజయ్ సైకిల్‌పై వచ్చిన వీడియోలు, ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తమ తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు.


చెన్నైలోని తన నివాసం నుంచి సైకిల్‌పై పోలింగ్ బూత్‌కు బయలుదేరారు హీరో విజయ్. ఆయన వెంట తన వ్యక్తిగత భద్రతా సిబ్బందితో పాటు, మరికొంత మంది ద్విచక్ర వాహనాల్లో అనుసరించారు. అయితే కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగానే విజయ్ ఇలా సైకిల్‌పై వచ్చారని సోషల్ మీడియాలో గట్టిగా ప్రచారం జరుగుతోంది. దీనికి విజయ్ టీం క్లారిటీ ఇచ్చింది. పోల్ బూత్ తన ఇంటికి దగ్గరలోనే ఉండడం వల్ల సైకిల్‌పై వెళ్లాలని విజయ్ నిర్ణయించుకున్నారని ఆయన టీం తెలిపింది. అంతే కాకుండా చెన్నైలోని ఇరుకు వీధుల కారణంగా కారులో వెళ్లడం కొంత ఇబ్బందికరంగా ఉంటుందని, దీని వెనుక మరే ఇతర కారణం లేదని వారు పేర్కొన్నారు.









Updated Date - 2021-04-06T20:19:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising