ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికల సంఘంలో కరోనా కలకలం

ABN, First Publish Date - 2021-04-21T00:16:01+05:30

కేంద్ర ఎన్నికల సంఘంలో కరోనా కలకలం రేపింది. ప్రధాన ఎన్నికల అధికారి సుశీల్ చంద్రతో పాటు మరో కమిషనర్ రాజీవ్ కుమార్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘంలో కరోనా కలకలం రేపింది. ప్రధాన ఎన్నికల అధికారి సుశీల్ చంద్రతో పాటు మరో కమిషనర్ రాజీవ్ కుమార్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం ఇద్దరూ హోమ్ క్వారంటైన్‌లో ఉన్నారు. అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌లో అందుబాటులో ఉండనున్నారని ఎన్నికల సంఘం కార్యాలయం తెలిపింది. 


ఈ నెల 13న 24వ సీఈసీగా సుశీల్ చంద్ర బాధ్యతలు స్వీకరించారు. 2022 మే 14 వరకు ప్రధాన ఎన్నికల అధికారిగా ఉండనున్నారు. గత లోక్‌సభ ఎన్నికల సమయంలో ఎన్నికల సంఘం సభ్యుడిగా నియమితులయ్యారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సునీల్ అరోరా పదవీ కాలం ముగియడంతో పదోన్నతి పొందారు. ముగ్గురు సభ్యుల ఎన్నికల సంఘంలో ప్రస్తుతం ఇద్దరు సభ్యులు మాత్రమే ఉండగా... మరో స్థానాన్ని భర్తీ చేయాల్సి ఉంది. ఈ ఇద్దరూ కరోనా బారిన పడ్డారు.    

Updated Date - 2021-04-21T00:16:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising