ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ వర్గాలపై దీదీ బహిరంగ యుద్ధం ప్రకటించారు: మోదీ

ABN, First Publish Date - 2021-04-12T22:58:04+05:30

ప్రధాని నరేంద్ర మోదీ పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై మరోసారి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నార్త్ 24 పరగణాలు: ప్రధాని నరేంద్ర మోదీ పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై మరోసారి విమర్శలు గురిపించారు. రాష్ట్రంలోని షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఇతర వెనుకబడిన తరగతులపై దీదీ బహిరంగ యుద్ధం ప్రకటించారని ఆక్షేపించారు. తనపైనే కాకుండా, బెంగాల్‌లోని ఎస్‌సీ, ఎస్‌టీ, ఓబీసీ వర్గాలకు చెందిన తన సోదర సోదరీమణులపై దీదీ యుద్ధం ప్రకటించారని నార్త్ 24 పరగణాల జిల్లాల్లో సోమవారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ మోదీ అన్నారు.


మొదటి నాలుగు విడతల పోలింగ్‌లో బెంగాల్ ప్రజలు బీజేపీకి విజయాన్ని ఖాయం చేశారని ప్రధాని పేర్కొన్నారు. మమత ఆగ్రహానికి ఇదొక కారణమని అన్నారు. ఎన్నికల్లో హింస గురించి మోదీ ప్రస్తావిస్తూ, ఎన్నికలు ప్రశాంతంగా జరగాలని కనీసం ఒక్క ఎన్నికల ర్యాలీలోనైనా మమత పిలుపునిచ్చారా అని ప్రశ్నించారు. హింసకు పాల్పడే వారు, ఓటింగ్‌ను అడ్డుకునే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మాటమాత్రంగానైనా మమత చెప్పారా అని ఆయన నిలదీశారు. కాగా, బెంగాల్‌లో 8వ విడతల పోలింగ్‌లో భాగంగా ఇంతవరకూ నాలుగు విడతలు పూర్తయ్యాయి. ఐదో విడత పోలింగ్ ఈనెల 17న జరుగనుంది.

Updated Date - 2021-04-12T22:58:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising