ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లోక్‌సభ ఉప ఎన్నిక: నాలుగు స్థానాల్లోనూ బీజేపీ వెనుకంజ

ABN, First Publish Date - 2021-05-02T23:08:11+05:30

కర్ణాటకలోని బెల్గాం, తమిళనాడులోని కన్యాకుమారి, ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి, కేరళలోని మలప్పురం లోక్‌సభ నియోజకవర్గాలకు ఉప ఎన్నిక జరిగింది. కాగా తిరుపతి స్థానంలో స్థానిక వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు దాదాపుగా ఖాయమైంది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతానికి జరిగిన అసెంబ్లీ ఎన్నికలతో పాటే దేశంలోని పలు అసెంబ్లీ నియోజకవర్గాలు, నాలుగు లోక్‌సభ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరిగాయి. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో వెనుకబడ్డట్టుగానే ఉప ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ వెనుకబడింది. నాలుగు లోక్‌సభ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల్లో ఒక్క స్థానంలో కూడా బీజేపీ ఆధిపత్యం కొనసాగించలేకపోయింది. అధికారంలో ఉన్న కర్ణాటకలోకి ఒక లోక్‌సభ నియోజకవర్గంలో కూడా అదే పరిస్థితి. కాగా కాంగ్రెస్ పార్టీ రెండు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది. ఇందులో ఒక నియోజకవర్గంలో దాదాపు గెలుపు ఖాయమన్నట్లుగా కనిపిస్తోంది.


కర్ణాటకలోని బెల్గాం, తమిళనాడులోని కన్యాకుమారి, ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి, కేరళలోని మలప్పురం లోక్‌సభ నియోజకవర్గాలకు ఉప ఎన్నిక జరిగింది. కాగా తిరుపతి స్థానంలో స్థానిక వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు దాదాపుగా ఖాయమైంది. కన్యాకుమారి స్థానంలో కాంగ్రెస్ విజయం కూడా అలాగే కనిపిస్తోంది. మలప్పురం స్థానంలో ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ విజయంవైపు దూసుకుపోతోంది. ఒక్క బెల్గాం నియోజకవర్గంలోనే బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోటాపోటీ కొనసాగుతోంది. ఇరు పార్టీల మధ్య ఓట్ల తేడా కేవలం 0.2 మాత్రమే. అతిస్వల్ప ఆధిక్యంతో కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది.

Updated Date - 2021-05-02T23:08:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising