ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేడు TS LAWCET

ABN, First Publish Date - 2021-08-23T18:09:21+05:30

రాష్ట్ర వ్యాప్తంగా న్యాయశాస్త్ర కోర్సుల్లో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రెండు రోజులుగా సంబంధిత వెబ్‌సైట్‌ షట్‌డౌన్‌

హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు ఇబ్బందులు

ప్రత్యామ్నాయంగా కొత్త వెబ్‌సైట్‌

హెల్ప్‌లైన్‌ కూ ఫోన్‌ చేయొచ్చన్న 

లాసెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ జీబీ రెడ్డి


హైదరాబాద్‌ సిటీ/కేయూ క్యాంపస్‌, ఆగస్టు 22: రాష్ట్ర వ్యాప్తంగా న్యాయశాస్త్ర కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే లాసెట్‌, పీజీఎల్‌సెట్‌-21 సోమ, మంగళవారాల్లో జరగనున్నాయి. మూడేళ్ల లా కోర్సుల ప్రవేశ పరీక్షలు సోమవారం ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయత్రం 4 గంటల వరకు నిర్వహిస్తారు. అలాగే, పీజీలాసెట్‌, ఐదేళ్ల కోర్సులో ప్రవేశాలకు పరీక్షలు ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయి. అయితే, ఉన్నత విద్యాశాఖ అధికారులు శని, ఆదివారాల్లో వివిధ కారణాలతో  జ్చూఠీఛ్ఛ్టి.్టటఛిజ్ఛి.్చఛి.జీుఽ వెబ్‌సైట్‌ను షట్‌డౌన్‌ చేశారు. దీంతో లాసెట్‌, పీజీఎల్‌సెట్‌కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు హాల్‌టికెట్ల కోసం ఇబ్బందులు పడుతున్నారు.


లాసెట్‌ హెల్ప్‌లైన్‌కు ఫోన్‌ చేసినా  సరైన స్పందన లేకపోవడంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. సాధారణంగా చాలా మంది అభ్యర్థులు పరీక్షలకు ఒకటి-రెండు రోజుల ముందు హాల్‌టికెట్‌ డౌన్‌లోడ్‌ చేసుకుందామని భావిస్తారు. శని, ఆదివారాల్లో వెబ్‌సైట్‌ పని చేయకపోవడంతో గందరగోళం నెలకొంది. కాగా, వెబ్‌సైట్‌ షట్‌డౌన్‌ చేస్తున్నామని విద్యార్థులందరికీ ముందుగానే మెయిళ్ల ద్వారా సమాచారం ఇచ్చామని.. ఈ నెల 20న రాత్రి 7 గంటలలోపు హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించామని లా సెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ జీబీ రెడ్డి గుర్తు చేశారు. హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌ల కోసం ప్రత్యామ్నాయంగా tsche.myhallticket.in వెబ్‌సైట్‌ తీసుకొచ్చామన్నారు. ఇబ్బందులు తలెత్తితే 7396114993 నంబరుకు ఫోన్‌ చేయాలని సూచించారు. 

Updated Date - 2021-08-23T18:09:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising