ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆర్‌ఆర్‌బీ పరీక్షలు..4.85 లక్షల దరఖాస్తుల తిరస్కరణ

ABN, First Publish Date - 2021-12-10T16:58:20+05:30

రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు(ఆర్‌ఆర్‌బీ)..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఈ నెల 15 నుంచి మరోమారు అప్‌లోడ్‌కు చాన్స్‌

ఇకపై పరీక్షలన్నీ ఆన్‌లైనే జరుగుతాయి: ఆర్‌ఆర్‌బీ


హైదరాబాద్‌(ఆంధ్రజ్యోతి): రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు(ఆర్‌ఆర్‌బీ) నియామక పరీక్షల్లో 4,85,607 అభ్యర్థుల దరఖాస్తులు తిరస్కరణకు గురైనట్లు రిక్రూట్‌మెంట్‌ బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది. 2019లో విడుదలైన నోటిఫికేషన్‌లోని పోస్టులకు సంబంధించి వచ్చిన దరఖాస్తుల్లో.. 4.85 లక్షల మంది ఫొటోలు/సంతకాల్లో తేడాలున్నాయని వివరించింది. దక్షిణ మధ్య రైల్వే(ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర) పరిధిలో సుమారు 26 వేల మంది దరఖాస్తులు తిరస్కరణకు గురైనట్లు పేర్కొంది. అలాంటి అభ్యర్థులకు ఈ నెల 15 నుంచి 26 వరకు ఫొటోలు, సంతకాలను తిరిగి అప్‌లోడ్‌ చేసుకునే అవకాశం కల్పిస్తున్నామని ప్రకటించింది. వీటి ఆమోదం విషయంలో ఆర్‌ఆర్‌బీదే తుది నిర్ణయమని స్పష్టం చేసింది.


కాగా.. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పరీక్షలు వచ్చే ఏడాది ఫిబ్రవరి 23 నుంచి దశలవారీగా జరుగుతాయని వివరించింది. కొవిడ్‌ నేపథ్యంలో కంప్యూటర్‌ ఆధారిత ఆన్‌లైన్‌ పరీక్షల(సీబీటీ)ను నిర్వహిస్తామని పేర్కొంది. పరీక్షకు నాలుగు రోజుల ముందు హాల్‌టికెట్లు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయని తెలిపింది.

Updated Date - 2021-12-10T16:58:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising