ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నూతన విద్యావిధానంతో ప్రాథమిక పాఠశాలలు కనుమరుగు

ABN, First Publish Date - 2021-12-30T18:23:12+05:30

ప్రాథమిక పాఠశాలలు కనుమరుగు కానున్నాయి. ప్రభుత్వ నూతన విద్యావిధానం పుణ్యమా అంటూ ఐదో తరగతి వరకు ఉన్న ప్రాథమిక పాఠశాలలు ఇక నుంచి ఒకటి, రెండు తరగతులకే పరిమితం కానున్నాయి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రాథమిక పాఠశాలల విలీనంలో నిబంధనల సవరణ

‘దూరం’ నిబంధన తొలుత 250 మీటర్లు

తాజాగా మూడు కిలోమీటర్లకు పెంపు 

ఒక్కటిగా అంగన్‌వాడీ, 1,2 తరగతులు 

టీచర్ల సర్దుబాటులోనూ గందరగోళం

ప్రాథమిక పాఠశాలలు కనుమరుగు కానున్నాయి. ప్రభుత్వ నూతన విద్యావిధానం పుణ్యమా అంటూ ఐదో తరగతి వరకు ఉన్న ప్రాథమిక పాఠశాలలు ఇక నుంచి ఒకటి, రెండు తరగతులకే పరిమితం కానున్నాయి. మూడు కిలోమీటర్ల దూరంలోపు ఉన్న ప్రాథమిక పాఠశాలల్లోని 3, 4, 5 తరగతులను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయాలంటూ మూడు రోజుల క్రితం ప్రభుత్వం విడుదల చేసిన జీవో ఉపాధ్యాయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గతంలో ఉన్నత పాఠశాలలకు 250 మీటర్ల దూరంలో ఉన్న ప్రాథమిక పాఠశాలల్లోని 3, 4, 5 తరగతులను విలీనం చేస్తామని చెప్పిన ప్రభుత్వం, ఇప్పుడు ఆ దూరాన్ని మూడు కిలోమీటర్లకు పెంచడం ద్వారా పేద పిల్లలను ఉచిత ప్రాథమిక విద్యకు దూరం చేయనుంది. 

ఆంధ్రజ్యోతి, మచిలీపట్నం : ఉన్నత పాఠశాలలకు 250 మీటర్ల దూరంలో ఉన్న ప్రాథమిక పాఠశాలల్లోని 3, 4, 5 తరగతులను విలీనం చేయాలని గతంలో నిర్ణయించిన  ప్రభుత్వం, తాజాగా ఈ దూరాన్ని 250 మీటర్ల నుంచి మూడు కిలోమీటర్లకు పెంచుతూ జీవో జారీ చేసింది. నూతన విద్యావిధానం అమలు ద్వారా ప్రాథమిక విద్యను నిర్వీర్యం చేసే దిశగా ప్రభుత్వ చర్యలున్నాయని ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఎయిడెడ్‌ పాఠశాలల బాటలోనే..
ఇటీవల కాలంలో జిల్లాలోని 357 ఎయిడెడ్‌ పాఠశాలల్లో పనిచేస్తున్న టీచర్లను ప్రభుత్వ పాఠశాలల్లోకి తీసుకున్నారు. ఆస్తులను తమ వద్దే ఉంచుకున్న అన్ని ఎయిడెడ్‌ సంస్థల యాజమాన్యాలు టీచర్లను ప్రభుత్వానికి అప్పగించేందుకు దాదాపు అంగీకరించాయి. ఎయిడెడ్‌ పాఠశాలల సంగతి ఇలా ఉండగా, ఉన్నత పాఠశాలకు 250 మీటర్ల దూరంలో ఉన్న 162 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లోని 3, 4, 5 తరగతులను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేశారు. తాజాగా ఈ దూరాన్ని మూడు కిలోమీటర్లకు పెంచడంతో జిల్లాలో 2,606 ప్రాథమిక పాఠశాలల మనుగడకు ముప్పు వాటిల్లనుంది. పది సంవత్సరాల్లోపు వయసు విద్యార్థులు మూడు కిలోమీటర్ల దూరం వెళ్లి చదువుకునేందుకు ఎంత వరకు సిద్ధపడగలరనేది ప్రశ్నార్థకమే. కిలోమీటరు దూరంలోపు అంగన్‌వాడీలను, ఒకటి, రెండు తరగతులను కలిపి ప్రాథమిక పాఠశాలలుగా గుర్తిస్తారు. 

పరిశీలిస్తున్నాం 
ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రాథమిక పాఠశాలల్లోని 3, 4, 5 తరగతుల విలీనం అంశాన్ని పరిశీలిస్తున్నాం. జాతీయ రహదారులు, ప్రధాన కాలువలు, ఇతరత్రా ప్రత్యేక పరిస్థితులు ఉన్న పాఠశాలలకు దీని నుంచి మినహాయింపు ఉంటుంది. కొత్త విధానం అమలుచేసే సమయంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. వాటిని పరిష్కరిస్తాం. 
- తాహెరా సుల్తానా, జిల్లా విద్యాశాఖాధికారిణి

Updated Date - 2021-12-30T18:23:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising