ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రూటు మార్చిన ఐఐటీలు.. టాప్‌ ర్యాంకర్లను ఆకర్షించడం కోసం ఏం చేస్తున్నాయంటే..

ABN, First Publish Date - 2021-10-25T13:56:50+05:30

రూటు మార్చిన ఐఐటీలు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టాపర్ల కోసం ఐఐటీల వేట


న్యూఢిల్లీ: ప్రతిభ గల విద్యార్థులకు ఫ్రీ ఎడ్యుకేషన్‌, వంద శాతం స్కాలర్‌షిప్‌లు అంటూ ప్రైవేటు విద్యాసంస్థలు పోటీపడటం తెలిసిందే. అయితే ఇంజనీరింగ్‌ విద్యకు ప్రపంచవ్యాప్తంగా పేరున్న ఐఐటీలు కూడా టాప్‌ ర్యాంకర్లను ఆకర్షించడానికి ఇదే పద్ధతిని అనుసరిస్తుండటం విశేషం. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో టాప్‌ ర్యాంకర్లు ఎక్కువగా బాంబే, ఢిల్లీ ఐఐటీల్లో చేరుతుంటారు. వీరిని తమవైపు తిప్పుకోవడానికి మిగతా ఐఐటీలు స్కాలర్‌షిప్‌లను ప్రకటిస్తున్నాయి. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో టాప్‌ 100 ర్యాంకులు సాధించిన విద్యార్థులకు ఐఐటీ ఖరగ్‌పూర్‌ ఇటీవల ఫుల్‌ రైడర్‌ స్కాలర్‌షిప్‌లను ప్రకటించిన సంగతి తెలిసిందే.


బీటెక్‌ కోర్సు పూర్తయ్యేవరకు ట్యూషన్‌ ఫీజులు, హాస్టల్‌ సహా ఆయా విద్యార్థుల చదువుకయ్యే ఖర్చులన్నీ భరించనున్నట్టు వెల్లడించింది. తాజాగా ఐఐటీ కాన్పూర్‌ కూడా ఇదే విధమైన స్కాలర్‌షిప్‌లను ప్రకటించింది. జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షలో టాప్‌ 100 ర్యాంకుల్లో నిలిచిన 10 మంది విద్యార్థులకు బ్రైట్‌ మైండ్స్‌ స్కాలర్‌షిప్‌ ఇవ్వనుంది. 


Updated Date - 2021-10-25T13:56:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising