గోండి భాష అంతరించిపోతోంది: కేంద్రం
ABN, First Publish Date - 2021-03-23T16:54:50+05:30
యునెస్కో జాబితా ప్రకారం గోండి భాష అంతరించిపోతోందని కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ సహాయ మంత్రి రేణుకా సింగ్ సరూట వెల్లడించారు. ఈ మేరకు టీఆర్‌ఎస్ ఎంపీ జీ రంజిత్ రెడ్డి అడిగిన ఓ ప్రశ్నకు కేంద్ర మంత్రి సోమవారం లిఖితపూర్వక సమాధానమిచ్చారు
యునెస్కో జాబితా ప్రకారం గోండి భాష అంతరించిపోతోందని కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ సహాయ మంత్రి రేణుకా సింగ్ సరూట వెల్లడించారు. ఈ మేరకు టీఆర్‌ఎస్ ఎంపీ జీ రంజిత్ రెడ్డి అడిగిన ఓ ప్రశ్నకు కేంద్ర మంత్రి సోమవారం లిఖితపూర్వక సమాధానమిచ్చారు. గిరిజన భాషల పరిరక్షణకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటు న్నదని.. కోయ, లంబాడీ, గోండి, కొలమి భాషల్లో రాష్ట్ర ప్రభుత్వం వర్ణమాల, స్థానిక కథలను ప్రచురించిందని వివరించారు. విద్యా హక్కు చట్టం 2009, నూతన విద్యా విధానం 2020 నిర్ధేఽశించిన విధంగా గిరిజన పిల్లలకు మాతృభాషల్లో విద్యను బోధించడానికి మాతృభాష ఆధారిత బహుళభాష విద్య కార్యక్రమాన్ని చేపడుతున్నామని పేర్కొన్నారు.
Updated Date - 2021-03-23T16:54:50+05:30 IST