ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాలేజీలను మూసేస్తాం.. అనుమతివ్వండి

ABN, First Publish Date - 2021-08-26T16:33:14+05:30

తమ కళాశాలను మూసివేసేందుకు అనుమతి ఇవ్వాలని రాష్ట్రంలోని నాలుగు ఇంజనీరింగ్‌ కాలేజీల యాజమాన్యాలు జేఎన్‌టీయూకు దరఖాస్తు చేసుకున్నాయి. వీటిని పరిశీలిస్తున్న అధికారులు త్వరలోనే ఒక నిర్ణయం తీసుకోనున్నారు. మరోవైపు, ఈ ఏడాది అడ్మిషన్ల కోసం కాలేజీలు, వాటిలోని కోర్సులు, సీట్ల సంఖ్యకు సంబంధించిన..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జేఎన్‌టీయూకు 4 ఇంజనీరింగ్‌ కాలేజీల అర్జీ

రెన్యువల్‌ కోసం 148 విద్యా సంస్థల దరఖాస్తు

గుర్తింపు ప్రక్రియలో అధికారులు

30లోపు సీట్ల సంఖ్యపై స్పష్టత


హైదరాబాద్‌, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి): తమ కళాశాలను మూసివేసేందుకు అనుమతి ఇవ్వాలని రాష్ట్రంలోని నాలుగు ఇంజనీరింగ్‌ కాలేజీల యాజమాన్యాలు జేఎన్‌టీయూకు దరఖాస్తు చేసుకున్నాయి. వీటిని పరిశీలిస్తున్న అధికారులు త్వరలోనే ఒక నిర్ణయం తీసుకోనున్నారు. మరోవైపు, ఈ ఏడాది అడ్మిషన్ల కోసం కాలేజీలు, వాటిలోని కోర్సులు, సీట్ల సంఖ్యకు సంబంధించిన గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఈ గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకునే గడువు ముగిసింది. దాంతో ఆయా కాలేజీల్లో ఉన్న మౌలిక సౌకర్యాలు, సిబ్బంది తదితర అంశాలను పరిశీలించే ప్రక్రియను అధికారులు చేపట్టారు. ఈ పరిశీలనను పూర్తి చేసి, ఈ నెల 30లోపు కాలేజీలకు గుర్తింపు ఇవ్వనున్నారు. 30 నుంచి ఇంజనీరింగ్‌ సీట్ల భర్తీకి సంబంధించిన షెడ్యూల్‌ ప్రారంభం కానుంది. జేఎన్‌టీయూ పరిధిలో సుమారు 148 ఇంజనీరింగ్‌ కాలేజీలు గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకున్నాయి. ఈ కాలేజీలు మొత్తం 955 కోర్సులు, 89,400 సీట్ల కోసం ప్రతిపాదనలు పంపించాయి. ఇక, కనీసం 8 సంవత్సరాల టీచింగ్‌ అనుభం ఉండి, పీహెచ్‌డీ పట్టా ఉన్న వారిని ప్రిన్సిపాల్‌ పోస్టుకు అర్హులుగా గుర్తించాలని నిర్ణయించారు.


ఫ్యాకల్టీపై ప్రత్యేక దృష్టి..

ప్రైవేటు ఇంజనీరింగ్‌ కాలేజీలకు గుర్తింపు ఇచ్చే విషయంలో ఈసారి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని జేఎన్‌టీయూ వీసీ నర్సింహారెడ్డి చెప్పారు. ఆయా కాలేజీల్లో మౌలిక సదుపాయాలను పరిశీలించే విధానంలో కూడా కొన్ని మార్పులు చేశామని తెలిపారు. ముఖ్యంగా ఫ్యాకల్టీకి చెల్లించే జీతాలపై సమాచారం సేకరిస్తున్నామని, తద్వారా టీచింగ్‌ సిబ్బంది విషయంలో కాలేజీలు అబద్ధాలు చెప్పడానికి అవకాశం ఉండదని పేర్కొన్నారు. అవసరమైతే వారికి సంబంధించిన ఫామ్‌-16ను కూడా పరిగణలోకి తీసకుంటామని వివరించారు. సెప్టెంబరు 1న ప్రత్యక్ష తరగతులు మొదలవుతున్నందున, ప్రైవేటు కాలేజీల్లోని టీచింగ్‌ సిబ్బందికి సంబంధించిన బయోమెట్రిక్‌ హాజరును పరిశీలిస్తామని వీసీ ప్రకటించారు. 


30 నుంచి ఎంసెట్‌ అడ్మిషన్లు..

ఇంజనీరింగ్‌ సీట్ల భర్తీ ప్రక్రియ ఈ నెల 30 నుంచి  మొదలు కానుంది. 30 నుంచి వచ్చే నెల 9 వరకు స్లాట్‌ బుకింగ్‌కు అవకాశం ఇవ్వనున్నారు. వచ్చే నెల 4 నుంచి 11 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ నిర్వహించనున్నారు. 4 నుంచి 13 వరకు అభ్యర్థులు కాలేజీల ఆప్షన్లను ఎంచుకోవాల్సి ఉంటుంది. సెప్టెంబరు 15న సీట్లను కేటాయించనున్నారు. మిగిలిన సీట్ల భర్తీ కోసం తుది దశ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ను తర్వాత ప్రకటించనున్నారు.

Updated Date - 2021-08-26T16:33:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising