ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

26 ఇంజినీరింగ్‌ కళాశాలలకు నోటీసులు

ABN, First Publish Date - 2021-04-23T16:49:23+05:30

ఇంజినీరింగ్‌ విద్యార్థుల నుంచి వసూలు చేసిన సెమిస్టర్‌ పరీక్షల ఫీజును వర్సిటీకి చెల్లించని 26 ఇంజినీరింగ్‌ కళాశాలల వివరణ కోరుతూ అన్నా యూనివర్సిటీ నోటీసులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా వున్న ఇంజనీరింగ్‌ కళాశాలలు, ఆలిండియా పాలిటెక్నిక్‌ ఎడ్యు కేషన్‌ కౌన్సిల్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్యారీస్‌(చెన్నై): ఇంజినీరింగ్‌ విద్యార్థుల నుంచి వసూలు చేసిన సెమిస్టర్‌ పరీక్షల ఫీజును వర్సిటీకి చెల్లించని 26 ఇంజినీరింగ్‌ కళాశాలల వివరణ కోరుతూ అన్నా యూనివర్సిటీ నోటీసులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా వున్న ఇంజనీరింగ్‌ కళాశాలలు, ఆలిండియా పాలిటెక్నిక్‌ ఎడ్యు కేషన్‌ కౌన్సిల్‌, ఏఐసీటీఈ, అన్నా యూనివర్సిటీ గుర్తింపు పొందాయి. వీటిలో స్వయం ప్రతిపత్తి లేని కళాశాలల విద్యార్థులకు అన్నావర్సిటీ పరీక్షల బోర్డు ఆధ్వర్యంలో సెమిస్టర్‌ పరీక్షలు నిర్వహించి, పట్టాలు అందజేస్తుంది. ఈ పరీక్షలకు, డిగ్రీ పట్టాల కోసం విద్యార్థుల నుంచి ఫీజు వసూలు చేసి  సకాలంలో అన్నావర్శిటీకి చెల్లించాల్సిన బాధ్యత ఆయా కళాశాలలదే. అయితే  2020 సంవత్సరం నుంచి విద్యార్థుల నుంచి వసూలు చేసిన  పరీక్షల ఫీజును వర్సిటీకి చెల్లించకుండా మోసం చేస్తున్నట్లు ఆరోపణలు రావడంతో ఆ కళాశాలల విద్యార్థులు మార్చి సెమిస్టర్‌కు హాజరైనా ఫలితాలను వర్సిటీ నిలిపేసింది. దీనిపై సంబంధిత విద్యార్థులు అన్నా వర్సిటీకి ఫిర్యాదు చేశారు. తాము ఫీజు చెల్లించినప్పటికీ సెమిస్టర్‌ పరీక్షా ఫలితాలు ప్రకటించలేదని, ఇందువల్ల తమ భవిష్యత్తు ప్రశ్నార్థకమ వుతుందని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన వర్సిటీ  విద్యార్థుల నుంచి వసూలు చేసిన ఫీజులు చెల్లించని 26 ఇంజనీరింగ్‌ కళాశాలలకు నోటీసులు జారీ చేసింది. తక్షణమే ఆ ఫీజులను చెల్లించాలని, లేనిపక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని అందులో హెచ్చరించింది.


Updated Date - 2021-04-23T16:49:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising