IIFPT Thanjavurలో ఖాళీలు
ABN, First Publish Date - 2021-10-29T15:29:31+05:30
భారత ప్రభుత్వ ఆహార శుద్ధి పరిశ్రమల..
భారత ప్రభుత్వ ఆహార శుద్ధి పరిశ్రమల మంత్రిత్వశాఖకు చెందిన తంజావూరులోని నిఫ్టెమ్-ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ(ఐఐఎ్‌ఫపీటీ)... ఒప్పంద ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ఖాళీలు: 18
సీనియర్ రీసెర్చ్ ఫెలో/జూనియర్ రీసెర్చ్ ఫెలో: 13.
ప్రాజెక్ట్ అసిస్టెంట్: 03
యంగ్ ప్రొఫెషనల్: 02
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీటెక్, ఎంటెక్/ఎమ్మెస్సీ/పీహెచ్‌డీ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: పురుష అభ్యర్థులకు 35 ఏళ్లు, మహిళా అభ్యర్థులకు 40 ఏళ్లు మించకూడదు
జీతభత్యాలు: పోస్టుల్ని అనుసరించి నెలకు రూ.20,000 నుంచి రూ.31,000+హెచ్‌ఆర్‌ఏ చెల్లిస్తారు
ఎంపిక విధానం: ఆన్‌లైన్ రాతపరీక్ష, ఆన్‌లైన్ ఇంటర్వ్యూ ఆధారంగా
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: నవంబరు 16
వెబ్‌సైట్: https://iifpt.edu.in/
Updated Date - 2021-10-29T15:29:31+05:30 IST