ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈ పర్వతం మీదికెళితే...

ABN, First Publish Date - 2021-05-06T23:11:47+05:30

ఇండోనేషియాలోని జావా ద్వీపంలోని మౌంట్ కేముకస్ అనే ప్రాంతం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జకార్తా : ఇండోనేషియాలోని జావా ద్వీపంలోని మౌంట్ కేముకస్ అనే ప్రాంతం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. దీనిని శృంగార పర్వతం(సెక్స్ మౌంటెన్) అని కూడా పిలుస్తారు. ఈ పర్వతం మీద ఉన్న ఓ దేవాలయంలో పండుగ వేళల్లో భక్తులు పెద్దసంఖ్యంలో వస్తుంటారు. 


ఈ పర్వతాన్ని కాలినడకడతో అధిరోహించి భక్తులు దేవాలయానికి చేరుకుంటుంటారు. ఈ దేవాలయం జావా రాజకుమారుడికి అతని సవతి తల్లికి గుర్తుగా నిర్మించారు. జావా రాజకుమారుడు, అతడి సవతి తల్లితో అక్రమ సంబంధం పెట్టుకోవడంతో వారిని రాజ్యం నుంచి వెలివేస్తాడు రాజు. వారిద్దరూ కలిసి కేముకస్ పర్వతం మీదకు వెళతారు. అక్కడ ఏకాంతంగా గడుపుతున్న సమయంలో సైనికులు వారిని చంపి అక్కడే పూడ్చిపెడతారు. ఈ విషయం స్థానిక ప్రజలకు తెలియడంతో వారు అక్కడ దేవాలయం నిర్మించి వారికీ పూజలు చేస్తున్నారు.


ఈ శృంగార పర్వతంపై ఏడాదికి 35 రోజుల పాటు పండుగ చేస్తారు. ఈ సమయంలో అక్కడికి వచ్చిన వారు.. పరిచయం లేని వ్యక్తులతో శృంగారం చెయ్యాల్సి ఉంటుంది. ఆలా ఏడు సార్లు ఒకే వ్యక్తితో శృంగారం చేస్తే మంచి జరుగుతుందని అక్కడి వారి నమ్మకం. కాగా... పెళ్లైనవారు కూడా ఇతరులతో శృంగారంలో పాల్గొంటారు. ఆ సమయంలో సమయంలో ఆ వ్యక్తితో ప్రేమలో పడడం, పెళ్లి చేసుకోవడం వంటివి కూడా ఇక్కడ జరుతుంటాయట.


అయితే... ఈ ఆచారాన్ని అక్కడి ప్రజలు కొందరు తిరస్కరిస్తున్నారట. పెళ్ళైన వారు భర్తలను వదిలేసి వెళ్లడమే వీరి తిరస్కరణకు కారణం. ఈ ఆచారం నేపధ్యంలో పెద్దసంఖ్యలో వివాహితలు ఇతరుల ప్రేమలో పడి భర్తలను వదిలేసి వెళ్లిపోయారట. దీంతో దీనిని నిషేదించాలన్న డిమాండ్ కూడా ఉంది. 

Updated Date - 2021-05-06T23:11:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising