ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP: 4,142 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌

ABN, First Publish Date - 2021-11-18T15:41:07+05:30

4,142 ఉద్యోగాల భర్తీకి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డీఎంఈలో 4,142 ఉద్యోగాలు

కొత్తగా 2,190.. ఖాళీలు 1,952.. భర్తీకి ఓకే

భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ 


అమరావతి(ఆంధ్రజ్యోతి): డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌లో 2,190 కొత్త ఉద్యోగాలు, 1,952 ప్రస్తుత ఖాళీల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. బుధవారం ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర దీనిపై ఉత్తర్వులు జారీ చేశారు. 2,190 ఉద్యోగాల్లో ప్రొఫెసర్లు 51, అసోసియేట్‌ ప్రొఫెసర్లు 187, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు 130, స్టాఫ్‌ నర్సులు 1,040, పారా మెడికల్‌ సిబ్బంది 782 పోస్టులను సృష్టించారు. మొత్తం 11 మెడికల్‌ కాలేజీల్లో అవసరానికి అనుగుణంగా ఈ పోస్టులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.


ఇవి కాకుండా మరో 1,952 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం అనుమతిచ్చింది. 282 మంది అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, 430 మంది స్టాఫ్‌ నర్సులతో పాటు బోధనాసుపత్రుల్లో అవసరమైన సిబ్బంది నియామకానికి అనుమతి ఇచ్చింది. దీనిపై డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ నియామకాలకు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది. 



Updated Date - 2021-11-18T15:41:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising