ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పారామెడికల్‌ కోర్సుల్లో ప్రవేశాలు

ABN, First Publish Date - 2021-03-02T20:02:45+05:30

ఆంధ్రప్రదేశ్‌ పారామెడికల్‌ బోర్డు ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో మొత్తం 861 సీట్లు ఉన్నాయి. వివిధ పారామెడికల్‌ విభాగాల్లో నిర్వహిస్తున్న ఈ కోర్సుల వ్యవధి రెండేళ్లు. ఆంగ్ల మాధ్యమంలో బోధన ఉంటుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రప్రదేశ్‌ పారామెడికల్‌ బోర్డు ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో మొత్తం 861 సీట్లు ఉన్నాయి. వివిధ పారామెడికల్‌ విభాగాల్లో నిర్వహిస్తున్న ఈ కోర్సుల వ్యవధి రెండేళ్లు. ఆంగ్ల మాధ్యమంలో బోధన ఉంటుంది. 


పారామెడికల్‌ విభాగాలు: మెడికల్‌ ల్యాబ్‌ టెక్నాలజీ, మెడికల్‌ ఇమేజింగ్‌ టెక్నాలజీ, ఆప్తాల్మిక్‌ అసిస్టెంట్‌ కోర్సు, డయాలసిస్‌ టెక్నాలజీ, రెస్పిరేటరీ థెరఫీ, మెడికల్‌ స్టెరిలైజేషన్‌ మేనేజ్‌మంట్‌ అండ్‌ ఆపరేషన్‌ థియేటర్‌ టెక్నాలజీ, పర్‌ఫ్యూజన్‌ టెక్నాలజీ, రేడియోగ్రాఫిక్‌ అసిస్టెంట్‌ కోర్స్‌, డార్క్‌రూమ్‌ అసిస్టెంట్‌ కోర్స్‌, కార్డియాలజీ టెక్నీషియన్‌ కోర్స్‌, క్యాథ్‌ ల్యాబ్‌ టెక్నాలజీ, ఈసీజీ టెక్నీషియన్‌ కోర్స్‌, అనెస్తీషియా టెక్నీషియన్‌ కోర్స్‌, ఆడియోమెట్రీ టెక్నీషియన్‌ కోర్స్‌, ఆప్టోమెట్రిక్‌ టెక్నీషియన్‌ కోర్స్‌, రేడియోథెరఫిక్‌ అసిస్టెంట్‌ కోర్స్‌.


అర్హత వివరాలు: గుర్తింపు పొందిన బోర్డు నుంచి బైపీసీ గ్రూపుతో ఇంటర్మీడియెట్‌ / తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. బైపీసీ అభ్యర్థులు అందుబాటులో లేని పక్షంలో ఎంపీసీ అభ్యర్థులకు, ఆ తరవాత ఇతర గ్రూపుల అభ్యర్థులకు అవకాశం ఇస్తారు. అభ్యర్థులకు  వయసు 16 ఏళ్లు నిండి ఉండాలి. 


ముఖ్య సమాచారం

దరఖాస్తు ఫీజు: రూ.100

దరఖాస్తుతో జతచేయాల్సిన పత్రాలు: పదోతరగతి సర్టిఫికెట్‌, ఆధార్‌ కార్డు, ఇంటర్‌ సర్టిఫికెట్‌ - మార్కుల పత్రాలు, ఆరు నుంచి ఇంటర్‌ వరకు స్టడీ సర్టిఫికెట్లు, కుల ధృవీకరణ పత్రం

ఎంపికైన అభ్యర్థులు బోర్డుకు చెల్లించాల్సిన ఫీజు: రూ.200

మెడికల్‌ కాలేజీలకు దరఖాస్తు చేరడానికి చివరి తేదీ: ఏప్రిల్‌ 10

కౌన్సెలింగ్‌, అభ్యర్థుల ఎంపిక తేదీ: ఏప్రిల్‌ 30

మెడికల్‌ కాలేజీలు ఎంపికైన అభ్యర్థుల జాబితాను బోర్డుకు సమర్పించడానికి చివరి తేదీ: మే 5

ప్రభుత్వ / ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లో చేరినవారి జాబితా బోర్డుకు పంపేందుకు చివరి తేదీ: మే 31

క్లాసులు ప్రారంభం: జూన్‌ 4

వెబ్‌సైట్‌: www.appmb.co.in

కాలేజీలు - సీట్లు

ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలు సీట్లు

గవర్నమెంట్‌ మెడికల్‌ కాలేజ్‌ (అనంతపురం) 72

ఆంధ్రా మెడికల్‌ కాలేజ్‌ (విశాఖపట్నం) 141

ఎస్వీ మెడికల్‌ కాలేజ్‌ (తిరుపతి) 111

రంగరాయ మెడికల్‌ కాలేజ్‌ (కాకినాడ) 101

గుంటూరు మెడికల్‌ కాలేజ్‌ (గుంటూరు) 115

రిమ్స్‌ (కడప) 130

సిద్దార్థ మెడికల్‌ కాలేజ్‌ (విజయవాడ) 70

కర్నూలు మెడికల్‌ కాలేజ్‌ (కర్నూలు) 121

మొత్తం 861

Updated Date - 2021-03-02T20:02:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising