ఎడ్యు పోర్టల్ హోమ్ స్కల్
ABN, First Publish Date - 2021-10-29T15:20:45+05:30
కేరళకు చెందిన..
కేరళకు చెందిన ఎడ్యు పోర్టల్ ‘హోమ్ స్కల్‘ ఆఫ్టర్ స్కూల్ ఈ లెర్నింగ్ అప్లికేషన్ ఆరంభమైంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, ఆగ్‌మెంటడ్ రియాలిటీని ఉపయోగించుకుని పని చేస్తోంది. సీబీఎ్‌సఈ సిలబ్‌సను కూడా అందిస్తోంది. మలయాళ ప్రముఖ నటుడు పృథ్వీరాజ్ దీనికి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. రికార్డు చేసిన పాఠాలకు తోడు లైవ్ క్లాసెస్ ముఖ్యంగా ఇరువైపులా ఇంటరాక్షన్‌కు అవకాశమిచ్చే విధంగా ఉంటాయి. అంటే సందేహాల నివృత్తికి అనుకూలంగా దీన్ని మలిచారు. ఆ యాప్‌లో ఈ-లైబ్రరీ ఉంది. పెద్ద ఎత్తున స్టడీ మెటీరియల్‌ను అందులో ఉంచారు. ఎన్‌సీఆర్‌టీ పుస్తకాల్లో ప్రతి చాప్టర్ ప్రకారం ప్రశ్నలతో స్టడీ మెటీరియల్ ఉంది. మరిన్ని వివరాలకు పోర్టల్ చూడవచ్చు.
Updated Date - 2021-10-29T15:20:45+05:30 IST