ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కూల్చే తొందర కట్టడంలో ఎందుకు లేదు!

ABN, First Publish Date - 2021-11-10T06:04:18+05:30

మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కడతామని దాదాపు 135 సంవత్సరాల చరిత్ర కలిగిన వరంగల్లు జైలుని మట్టిలో కలిపేశారు. హాస్పిటల్ కోసం గౌరవ ముఖ్యమంత్రి శంకుస్థాపన కూడా చేశారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కడతామని దాదాపు 135 సంవత్సరాల చరిత్ర కలిగిన వరంగల్లు జైలుని మట్టిలో కలిపేశారు. హాస్పిటల్ కోసం గౌరవ ముఖ్యమంత్రి శంకుస్థాపన కూడా చేశారు. కానీ అదే రోజు నూతన జైలుకి కూడా శంకుస్థాపన ఎందుకు చేయలేదు అనే అనుమానాలు వరంగల్ ప్రజలకు కలుగుతున్నవి. స్వాతంత్ర పోరాటం, ఎమర్జెన్సీ, తెలంగాణ తొలి మలి దశ ఉద్యమాలు... ఇలా ఎన్నో కాలాలకు ఉద్యమ పాఠాలు నేర్పిన కారాగారం ఇది. అన్ని వసతులూ కలిగిన కారాగారాన్ని కూల్చివేయడం వరంగల్ ప్రజలను, మొత్తం రాష్ట్ర ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నది. ప్రభుత్వం ముందు వరంగల్‍లో కొత్త జైలు నిర్మాణం చేసిన తర్వాత సిబ్బందిని, ఖైదీలను నూతన జైలులోకి తరలించి ఉంటే బాగుండేదని అంతా భావిస్తున్నారు. అంతేగాక, అసలు కొత్తగా జైలు నిర్మించదలచిన స్థలంలోనే ఆసుపత్రి కట్టి ఉంటే 135 ఏళ్లనాటి చారిత్రక సంపద, ప్రజల సొమ్ము వృథా కాకుండా ఉండేవని మరికొందరి వాదన. ప్రభుత్వ కాలయాపన వల్ల ఇప్పుడు అసలు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం జరుగుతుందా అని కొందరు అనుమానపడుతున్నారు. ఇన్ని రోజులయినా పనులు ప్రారంభం కాలేదు. పనులను ప్రభుత్వం సత్వరం ప్రారంభించి పూర్తి చేయాలి. నేడు వరంగల్ వస్తున్న గౌరవ ముఖ్యమంత్రి అన్ని ఆధునిక సౌకర్యాలతో జైలును, ఆసుపత్రిని ఒకేసారి కట్టాలి అన్న ప్రజల విన్నపాన్ని స్వీకరించాలి.

ముచ్కుర్ సుమన్ గౌడ్


Updated Date - 2021-11-10T06:04:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising