ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రైవేటుపై ఎందుకీ వేటు?

ABN, First Publish Date - 2021-03-26T06:27:13+05:30

ఓ ప్రభుత్వమా, ప్రైవేటు ఉపాధ్యాయులంటే ఎందుకంత అలుసు? ప్రైవేటు ఉపాధ్యాయులపై ఈ వేటెందుకు మా జీవితాలపై ఆ కాటెందుకు? ప్రభుత్వ కళాశాలల్లో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఓ ప్రభుత్వమా, ప్రైవేటు ఉపాధ్యాయులంటే ఎందుకంత అలుసు? ప్రైవేటు ఉపాధ్యాయులపై ఈ వేటెందుకు మా జీవితాలపై ఆ కాటెందుకు? ప్రభుత్వ కళాశాలల్లో కరోనా కేసులు పెరిగితే తప్పు మాదా? ప్రైవేటు విద్యా సంస్ధలు మూయడమెందుకు? గవర్నమెంట్ ఉపాధ్యాయులకిచ్చినట్టు పీఆర్‌సీ ఇచ్చిండ్లా? ఇంట్లకూసుండబెట్టి జీతాలిస్తున్నరా.? పదివేల చెక్కు మీద సంతకం పెట్టే కెపాసిటీ మాకు లేదు కానీ... పదిగంటలు పనిజేసి పిల్లలకు పరిపూర్ణంగా చదువుజెప్పే కెపాసిటీ మాది. నవజాత శిశువు నుండి భావిభారత పౌరుడుగా ఎదిగేందుకు తోడుండేది ఉపాధ్యాయుడే, ఎందుకు తనంటే నీకు చులకన? మిమ్మల్ని నిలబెట్టేందుకు మేమే గావాలే...గెలిపెంచేందుకు మేం గావాలే... కానీ... మా బతుకులు మాత్రం నీకు వద్దు...!!! మేం పీఆర్‌సీ అడుగలే, ఇంక్రిమెంటూ అడగలే, మా పొట్టగొట్టద్దు అనేదే మా వాదన. కరోనా కేసులు ప్రభుత్వ గురుకులాల్లోనే ఉన్నయ్‌, ప్రైవేటు కళాశాలల్లో పాజిటివ్ కేసులు వచ్చినయా... తప్పు మీదా ..మాదా.. ఆలోచించుకో ఓ ప్రభుత్వమా!!!

అడప రాజు, సీతారాంపురం

వరంగల్ రూరల్ జిల్లా

Updated Date - 2021-03-26T06:27:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising