ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోరాట పద్యం ఏమున్నదిక్కడ ! ..

ABN, First Publish Date - 2021-03-22T06:44:07+05:30

బండారు రంగస్థల పద్యాల్లా గర్జించి గాండ్రించి పొగలు చిమ్మే భూముల్ని దినం రోజున మరమరాల ఫలహారంలా పంచాక కూడా...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బండారు రంగస్థల పద్యాల్లా  

గర్జించి గాండ్రించి పొగలు చిమ్మే భూముల్ని 

దినం రోజున మరమరాల ఫలహారంలా పంచాక కూడా 

బైబులు చేతిలోనే ఉంది 

మన భూములు లాక్కున్న భారతీయులెవరు 


ప్రధమ ఫలాన్ని చర్చ్‌లో మిషన్‌ వారి దేవుని పాటగా 

మాటవరసకు రెండుమూడుసార్లు పాడి కొట్టేసిన్నట్లు 

శిలీంధ్రాలన్నిటికీ సెటిలర్స్‌గా శాశ్వత ముద్రపడ్డా 

మాతృకణ జీవసమూహలన్నిటితో కలిసి ఏకమై పోరినా 

ఉక్కులా పైకిలేచిన మహావృక్షం ఒక్క అవకాశమూ లేక 

ఆస్తులుపోయి తప్పిపోయిన కుమారుడయ్యింది    


రాచనెలవుగా మార్చుకున్న రాచిలుకల చిరునామాలు

యంత్రశాలలపై తీగపాకిన ఆకాంక్షల కాలనీల్లో    

బుల్డోజర్‌ కింద నలిగి 

అంబ పలకని జగదాంబ పలకని బుడబుక్కలోళ్ళ ద్విపదల్లా అంతరించిపోతాయి  

ప్రభుత్వ విహంగం రెక్కలు విరిగి ప్రభువునందు నిద్రిస్తుంది 


అవ్యాచ్య కాదుగానీ  

గోంగూరను ఆంధ్రమాతగా రాసిన కీర్తనలే పాడి

పురుగుపట్టని పండు మిరప తొక్కును పెరుగులో నాకి   

శ్రీనాధుడి కమ్మటి తెలుగు భోజన రుచులే చాటువులనుకుని  

గ్లట్టన్‌ ఇష్టపద్యాలు చదవడమేగానీ 

పోరాట పద్యం ఏమున్నదిక్కడ ! 


పచ్చి తాటాకుల పందిళ్ళలో పెళ్లిళ్లు చేసుకున్న దేశం 

ప్రవేటు కనోపీలకింద ఈతచాపల ధ్యానానికి జుగల్బందీ అవుతుంది 

సకలాంధ్రుల ఆత్మగౌరవం ‘బిక్రీ కేలియే నహీ’ యని 

బిగ్గరగా అరిచి చెప్పేదెవడు ఓ తెలుగు బాలా!


గుండెకాయను కోసి ఆవకాయలా అమ్ముకున్నాక  

దేహానికి గుండెకాయ ప్రాణావసరతల గురించి వారసత్వ సంపదలన్నీ 

ఉత్తరాదికి ఊరగాయ అవుతున్న  ముషాయిరాల్లో  

తోడేలే గొర్రెలకు ప్రబోధ కవితలు భేషుగ్గా వినిపిస్తుంది 


ఆంధ్రాబాంక్‌ హుళక్కి అయ్యాక   

దేనికీ తెలుగు కవచకుండలాలు లేవు

దేశభక్తి నృత్యరూపకం మీద తెరలేచిన వాదానికి   

ఏ తాయిలాల పేలాలూ పేలంగీలూ పేలలూ  

ఏ నిరుపేదలూ ఉచితంగా పొందడానికి లేదు 

ఒక శ్వాసను పీల్చాలంటే 

ఒక ఊపిరిని అమ్మకానికి వదలాలి 

సోలార్‌ సబ్సిడీ సూర్యుడు కూడా ధనిక కొంపలమీదే ఉదయిస్తాడు  

ఈ దేశానికిక  సోషలిస్టు కాయలు కాస్తాయో లేదో !  

(విశాఖ ఉక్కు ఫాక్టరీ కోసం నాడు నిరాహార దీక్ష చేసి సాధించిన కీర్తిశేషులు అమృతరావుగారికి )

తుల్లిమల్లి విల్సన్‌ సుధాకర్‌ 

9538053030


Updated Date - 2021-03-22T06:44:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising