ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పీఆర్సీ ఫిట్మెంట్ ఎప్పుడు?

ABN, First Publish Date - 2021-11-11T06:08:17+05:30

సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగ ఉపాధ్యాయులకు స్వరాష్ట్రంలో ప్రకటించిన మొదటి పీఆర్సీ ఫిట్మెంట్ ఇంకా అందని ద్రాక్షగానే మిగిలింది. స్వయంగా ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా 30శాతం పీఆర్సీ ఫిట్మెంట్ కాంట్రాక్ట్...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగ ఉపాధ్యాయులకు స్వరాష్ట్రంలో ప్రకటించిన మొదటి పీఆర్సీ ఫిట్మెంట్ ఇంకా అందని ద్రాక్షగానే మిగిలింది. స్వయంగా ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా 30శాతం పీఆర్సీ ఫిట్మెంట్ కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగ ఉపాధ్యాయులకూ వర్తిస్తుందని ప్రకటించినప్పటికీ కార్యరూపం దాల్చ లేదు. సమగ్ర శిక్ష విభాగంలో పనిచేస్తున్న సుమారు 18వేల ఉద్యోగ ఉపాధ్యాయులకు ఇప్పటికీ సంబంధిత ఉత్తర్వులు వెలువడ లేవు. సమగ్ర శిక్ష విభాగంలో కేంద్ర వాటా 60శాతం, రాష్ట్ర వాటా 40శాతం ఉన్నందున పీఆర్సీ ఫిట్మెంట్ 40శాతానికే వర్తిస్తుందని ఉన్నత అధికారులు షరతు విధించటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. కేంద్ర రాష్ట్ర భాగస్వామ్య పథకంలోనే పనిచేస్తున్న అంగన్వాడీ, ఆశా వర్కర్ల పీఆర్సీ ఫిట్మెంటుకు లేని షరతు సమగ్ర శిక్ష ఉద్యోగులకే ఎందుకు? గత పదిహేనేళ్లుగా పని చేస్తున్నా రెగ్యులరైజేషన్ అందని ఈ ఉద్యోగులు కనీసం పెంచిన పీఆర్సీ ఫిట్మెంట్ అయినా వర్తింపజేస్తే బాగుండని వాపోతున్నారు.

జుర్రు నారాయణ యాదవ్,

తెలంగాణ టీచర్స్ యూనియన్,

జిల్లా అధ్యక్షులు, మహబూబ్ నగర్

Updated Date - 2021-11-11T06:08:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising