ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏ ఓటమికి ఏం చేయాలి?

ABN, First Publish Date - 2021-07-07T06:05:41+05:30

హరిభూషణ్‌, సారక్కలకు పాణి నివాళి ‘అస్తిత్వ పరిధులు దాటి కార్మిక వర్గ ప్రతినిధులై...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హరిభూషణ్‌, సారక్కలకు పాణి నివాళి ‘అస్తిత్వ పరిధులు దాటి కార్మిక వర్గ ప్రతినిధులై...’ (ఆంధ్రజ్యోతి, జులై 2) శ్రద్ధగా చదివాను. వారిద్దరి త్యాగం చాలా గొప్పది. అయితే నాకు కొన్ని సందేహాలున్నాయి. వారు ఏ విప్లవోద్యమంలో పాల్గొన్నారూ? అది వ్యవసాయిక విప్లవమా? నూతన ప్రజాస్వామిక విప్లవమా? మరేదయినా విప్లవమా? నూతన ప్రజాస్వామిక విప్లవం అనే కాన్సెప్ట్‌ 1920వ దశకంలో చైనాలో పుట్టింది. నాలుగు వైరుధ్యాలు, ప్రధాన వైరుధ్యం. నూతన ప్రజాస్వామిక విప్లవంలో అంతర్భాగంగా వ్యవసాయ విప్లవాన్ని పూర్తి చేయడం. ముందు గ్రామాలను విముక్తి చేయడం. తరువాత పట్టణాలను విముక్తి చేయడం వగయిరాలు దీని రోడ్‌మ్యాప్. గడిచిన శతాబ్ద కాలంలో నూతన ప్రజాస్వామిక విప్లవోద్యమం ఈ రోడ్‌మ్యాప్‌లో ఎన్ని మైలురాళ్ళను దాటింది? వందేళ్ళ క్రితపు విప్లవోద్యమ నమూనా నేటి భారత సమాజానికి వర్తిస్తుందా? అర్ధవలస అర్ధభూస్వామ్య వ్యవస్థకు పరిష్కారంగా నూతన ప్రజాస్వామిక విప్లవం అనే కాన్సెప్టూ రూపుదిద్దుకుంది. ఇప్పటి సమాజాన్ని కూడా హరిభూషణ్‌, సారక్క వంటి వారు అర్ధవలస అర్ధభూస్వామ్య వ్యవస్థగా పరిగణిస్తున్నారా? కొందరు మావోయిస్టులు ఇటీవల వర్తమాన సమాజాన్ని ‘బ్రాహ్మణీయ హిందూ ఫాసిస్టు సమాజం’, ‘హిందూ మత రాజ్యం’ అంటున్నారు. అర్ధవలస అర్ధభూస్వామ్య వ్యవస్థకు పరిష్కారంగా రూపుదిద్దుకున్న నూతన ప్రజాస్వామిక విప్లవం అనే కాన్సెప్టూ ‘బ్రాహ్మణీయ హిందూ ఫాసిస్టు సమాజం’ ‘హిందూ మత రాజ్యం’ లకు కూడా వర్తిస్తుందా? నాలుగు వైరుధ్యాలు, ప్రధాన వైరుధ్యం మారదా? ఇది హిందూమత రాజ్యం, ‘బ్రాహ్మణీయ హిందూ ఫాసిస్టు సమాజం’ అయితే ప్రధాన వైరుధ్యం ఏ ఏ సమూహాల మధ్య ఉంటుంది? పరిష్కారంగా హరిభూషణ్‌, సారక్కలు చూపిన మార్గం ఏమిటి? వీటికి జవాబులు పాణి నివాళిలో ఎక్కడా కనిపించలేదు.


సాంఘిక అస్తిత్వ సమూహాలైన ఆదివాసులు, దళిత బహుజనులు, మహిళల ప్రస్తావన ఉంది గానీ మత మైనారిటీల ప్రస్తావన విప్లవోద్యమంలో ఉన్నట్టు ఈ వ్యాసంలో కనిపించలేదు. మైనారిటీల ప్రస్తావన లేకపోవడం అంటే ‘బ్రాహ్మణీయ హిందూ ఫాసిస్టు సమాజం’ ‘హిందూ మత రాజ్యం’ మీద పోరు విప్లవోద్యమ అజెండాలో లేదని అర్థం. గురజాడ కన్యాశుల్కంలో జట్కావాలాకు వచ్చిన సందేహం లాంటిది నాకూ ఒకటుంది. ఎన్డీఎ కూటమిని 2024 ఎన్నికల్లో ఓడించడానికి ఏం చేయాలి? అని. అలాంటి కార్యక్రమం ఏదైనా ఉందా? లేకుంటే, బాఖీ సబ్ బక్వాస్.

డానీ

Updated Date - 2021-07-07T06:05:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising