ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కథ కావాలి

ABN, First Publish Date - 2021-07-19T05:37:27+05:30

హఠాత్తుగా కల ఆగిపోయింది ఓ పొట్టి వీరుడు పొడుగు వీరుణ్ణి హతమార్చాడు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హఠాత్తుగా

కల ఆగిపోయింది

ఓ పొట్టి వీరుడు

పొడుగు వీరుణ్ణి

హతమార్చాడు

ఎండరాజును

వాన సుందరి

మాయం చేసింది

చెట్టు కింద కూర్చున్న

పేదరాశి పెద్దమ్మతో 

పులి ఏదో మాట్లాడి పోయింది


ఎండని ఏడో చేప

చెర్లోకెళ్లి 

జీవితాన్ని తిరగేసింది

బంగారుగుడ్డు పెట్టే 

బాతును చంపిన

మనిషొకడు దిగులు గూడు అల్లుతున్నాడు

చీమలు దూరని చిట్టడవి

కాకులు దూరని కారడవి


అప్పుడొక కథ పుట్టింది

గడ్డి పువ్వు, గాలికి చెప్పిన కథ

గాలి నీటికి చెప్పిన కథ

నీరు నేలకు చెప్పిన కథ

నేల

మనిషికి చెప్పిన కథ


కథ

ఏడేడు సముద్రాలు దాటింది


నిద్ర రాని రాత్రులను

జోకొట్టే కథ

హృదయాన్ని మెలిపెట్టే కథ

భూమి కోసం

పరుగు తీసిన వాడి కథ

సముద్రాన్ని తవ్విన 

వీరుని కథ

రొట్టెను పంచిన పిల్లి కథ


ఇప్పుడు

లేడి చంపిన

పులి కథ కావాలి

కొంగను చంపే

చేప కథ కావాలి

దేశం లోపల జరిగే 

కుట్రల కథలకు

నిప్పు పెట్టే

  ఒక్క

  అగ్గిపుల్ల కథ కావాలి

సుంకర గోపాలయ్య

94926 38547


Updated Date - 2021-07-19T05:37:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising