ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైస్‌ చాన్స్‌లరా, టిఆర్‌ఎస్‌ కార్యకర్తా!

ABN, First Publish Date - 2021-10-21T06:13:40+05:30

ద్యార్థి వ్యతిరేక నిర్ణయాల పైన, సమస్యల పైన నిరసన కార్యక్రమాలు చేపట్టడం విద్యార్థులకు రాజ్యాంగం కల్పించిన హక్కు. దీన్ని కాలరాస్తూ, సమస్యలపై శాంతియుతంగా...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ద్యార్థి వ్యతిరేక నిర్ణయాల పైన, సమస్యల పైన నిరసన కార్యక్రమాలు చేపట్టడం విద్యార్థులకు రాజ్యాంగం కల్పించిన హక్కు. దీన్ని కాలరాస్తూ, సమస్యలపై శాంతియుతంగా పోరాటం చేస్తున్న విద్యార్థి నాయకులపై కేసులు నమోదు చేయడం చాలా బాధాకరమైన విషయం. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న లక్షా 91 వేల ఉద్యోగాలను భర్తీ చేయాలని ఉస్మానియా యూనివర్సిటీ ఆవరణలో శాంతియుతంగా నిరసన వ్యక్తం చేసిన ఎబివిపి విద్యార్థి నాయకులపై కేసు నమోదు చేయడం రాజ్యాంగ వ్యతిరేక చర్య. ఉస్మానియా యూనివర్సిటీని ఉద్యమాలు లేని నిషేధిత ప్రాంతంగా మార్చాలనే టిఆర్ఎస్ ప్రభుత్వ ఎజెండాను ముందుకు తీసుకుని వచ్చి విద్యార్థి నాయకులను, విద్యార్థి సంఘాలను వైస్ చాన్సలర్ రవీందర్ యాదవ్ కేసుల పేరుతో వేధిస్తున్నరు. రాష్ట్రప్రభుత్వం చేతిలో కీలుబొమ్మగా మారి ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రశ్నించిన ఎబివిపి విద్యార్థి నాయకులపై కేసులు పెట్టి ఆయన తన రాజభక్తిని చాటుకుంటున్నారు. టిఆర్ఎస్ కార్యకర్తలా వ్యవహరిస్తున్నారు. అధికారపక్షం అగ్రనాయకత్వం తన సామాజికవర్గానికి సంబంధించిన వారు కావడంవల్లనో లేక తన పదవికి సహకరించారనే కృతజ్ఞతతోనో ఆయన ఇలా వ్యవహరిస్తుండవచ్చు.


ఒక్క సెప్టెంబరు నెలలోనే నిరుద్యోగ సమస్యపై ఆర్ట్స్ కళాశాల ఆవరణలో ప్రభుత్వంపై నిరసన తెలిపినందుకు ఐపిసి 341, 290, 427 సెక్షన్ల కింద;  యూనివర్సిటీ విద్యార్థులు పరీక్షల కోసం చదువుకోవడానికి కొంత సమయం ఇవ్వాలని కోరుతూ వారికి మద్దతుగా నిలిచిన సందర్భంలో ఐపిసి 341, 506 సెక్షన్ల కింద; యూనివర్సిటీల్లో ఇంజనీరింగ్ కోర్సుల ఫీజు పెంపును నిరసిస్తూ వీసీ ఛాంబరులో ధర్నా చేసినందుకు ఐపిసి 448 ఆర్/డబ్ల్యూ, 34 సెక్షన్ల కింద; ఈ వరుస కేసులకు నిరసనగా అడ్మిన్ బిల్డింగ్ వద్ద శాంతియుతంగా బంద్ నిర్వహించినందుకు ఐపిసి 342 ఆర్/డబ్ల్యూ, 34 సెక్షన్ల కింద కేసులు పెట్టి విద్యార్థి నాయకులను వేధిస్తున్నారు.


యూనివర్సిటీలకు వీసీలు వస్తూంటారు పోతుంటారు. కానీ విద్యార్థుల గొంతుక అయిన అఖిల భారతీయ విద్యార్థిపరిషత్ విద్యార్థుల సమస్యలపై నిరంతరం ఉద్యమాలను కొనసాగిస్తుంది. ఈ విషయాన్ని వీసీ గుర్తుంచుకుని నడుచుకోవాలి. విద్యార్థులపై పెట్టించిన కేసులన్నిటినీ ఆయన వెంటనే ఉపసంహరింపచేయాలి.

జీవన్ ఎంఏ, (పి.హెచ్.డి)

Updated Date - 2021-10-21T06:13:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising