ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వంగపండూ...!

ABN, First Publish Date - 2021-08-04T06:04:10+05:30

సిక్కోలు సమరాన ధిక్కార స్వరమొకటి విశాఖ ఉక్కయిన ఆంధ్రుల హక్కొకటి ఎడతెగని సంద్రాన...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిక్కోలు సమరాన

ధిక్కార స్వరమొకటి

విశాఖ ఉక్కయిన

ఆంధ్రుల హక్కొకటి

ఎడతెగని సంద్రాన

ఎదురెల్లె నావొకటి

అడిగాయిలే నిన్ను 

వంగపండూ–నీ

కలము నుండి జారిపడుకుంటూ

        IIఅడిగాయిలేII


జానెడు కడుపుకై

ధారబోసిన చెమట

దేహమే కంజరయి

ధనధన సప్పుడట

కాల్లగజ్జెలు ఘల్లు

నెమలితో పోటీపడి

చేతి అందెల మోగె 

వంగపండు–నీ

గుండె చప్పుడును వినుకుంటూ

        IIచేతిII


ఏం పిల్లడోయని

ఎలుగెత్తి పాడినా

ఎల్దమస్తవంటు

రమ్మని అడిగినా

యంత్రాల పాటతో

మంత్రముగ్ధుల జేసె

కథ జెప్తవా వింటాను 

వంగపండు–నా

రెండు కండ్లు జూస్తె 

చాలకుండూ


ఎవరు దోసుకుపోని

ఆటపాటల మూట

ఆస్తులుగ పిల్లలకు

పంచిపోయావంట

సీమలదండులో

సిలుకలా గుంపులో

సాగిపోతివ నీవు 

వంగపండు–వంగె

పొద్దులో వర్ణాలు జూసుకుంటూ


కాలమే కడుపుతో

కన్న కవులెందరో

మేరిమి కొండల్లో

మెరుపులింకెందరో

జముకు జనరాగంగా

అందియలు మోగంగ

ఉర్రూతలూగెనట ఉత్తరాంధ్ర–నీ

చరితనే దేశము 

చదువుతుండా


సలాములే నీకు 

వంగపండు–పాట

సలాములె నీకు వంగపండు

లాల్‌సలాములే నీకు 

వంగపండు–ఆట

సలాములే నీకు వంగపండు

(వంగపండు ప్రథమ వర్ధంతి నేడు విశాఖలో జరుగుతున్న సందర్భంగా)

మిత్ర

Updated Date - 2021-08-04T06:04:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising