ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘చారిత్రక అవాస్తవాలు’లో అసత్యాలు

ABN, First Publish Date - 2021-07-09T06:12:32+05:30

‘చారిత్రక అవాస్తవాలు’ శీర్షికతో జూన్ 12న తెలకపల్లి రవి తెలంగాణ పోరాటంలో పుచ్చలపల్లి సుందరయ్య పాత్ర, ఉనికి గురించి చెప్పిన అంశాలతో విభేదిస్తున్నాం....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘చారిత్రక అవాస్తవాలు’ శీర్షికతో జూన్ 12న తెలకపల్లి రవి తెలంగాణ పోరాటంలో పుచ్చలపల్లి సుందరయ్య పాత్ర, ఉనికి గురించి చెప్పిన అంశాలతో విభేదిస్తున్నాం. కమ్యూనిస్టు కరపత్రాలు, సుందరయ్య రాతలు మా హైదరాబాద్ రాజ్య / తెలంగాణ చరిత్ర కానే కాదు. రెడ్డి హాస్టల్ నిజాం వ్యతిరేక పోరాట యోధులకు ఆశ్రయం అని ఆయన నొక్కి వక్కాణించారు. అది అసత్యం. అనేక దశాబ్దాలు రెడ్డి హాస్టల్‌తో అనుబంధం ఉన్న అప్పటి నాయకుడు కొండా వెంకట రంగారెడ్డి కూడా ఏనాడూ రెడ్డి హాస్టల్ నిజాం ప్రభుత్వ వ్యతిరేక పోరాటం చేసిందని చెప్పలేదు. 


తెలంగాణ పోరాట నేపథ్యంలో పుచ్చలపల్లి సుందరయ్య తెలంగాణ భూభాగంలో ఎప్పుడు అడుగుపెట్టాడు అనే దాని మీద అసంబద్ధత ఉంది. ఖమ్మంలో జరిగిన సమావేశ నేపథ్యం వేరు. ఇక పిండిపోలు గ్రామం ద్వారా ప్రవేశించారనడానికి, ఆ గ్రామం తెలంగాణ -ఆంధ్రా సరిహద్దు గ్రామం కానే కాదు. ఇక రవి ఏమన్నారంటే, ‘పరిశోధనా బృందాల పేరిట పనిచేస్తున్నప్పుడు వాస్తవాలను వాస్తవాలు గానే నమోదు చేయడం ముఖ్యం’. ఇప్పుడు మేము అదే పనిలో ఉన్నాం. వాస్తవంగా జరిగినదాన్ని స్వతంత్ర కోణంలో విశ్లేషించి వాస్తవాలనే నమోదు చేస్తున్నాం. నిజాలతో కూడిన సమాచారం మాలాంటి వారు రాసినప్పుడు, రవి లాంటి కమ్యూనిస్టు సిద్ధాంతులకు వింతగా ఉన్నట్టుంది. 

డా. కె. శ్రీరామ్, డా. ఎన్. అజయ్ 

హైదరాబాద్ దక్కన్ ఇండిపెండెంట్ రీసెర్చర్స్ గ్రూప్

Updated Date - 2021-07-09T06:12:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising