ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముఖం లేని పుస్తకం

ABN, First Publish Date - 2021-08-09T06:27:11+05:30

అంతా సవ్యంగా వున్నట్టే వుంటుంది ఏదో మూలనుంచి అదాటున ఆపదగాలి రేగడం మొదలౌతుంది వాస్తవం ఒళ్ళు విరుచుకుంటున్నంతలో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

1.

అంతా సవ్యంగా వున్నట్టే వుంటుంది

ఏదో మూలనుంచి అదాటున ఆపదగాలి

రేగడం మొదలౌతుంది

వాస్తవం ఒళ్ళు విరుచుకుంటున్నంతలో

అబద్ధం అందంగా ముస్తాబై నిలుచుంటుంది

మాట పాట 

కదలిక కంటిచూపే కాదు

మనకు తెలియకుండా ఏకాంతాలూ

ఎదుటివారి నెట్టింట్లో తైతక్కలాడుడుంటాయి


2. 

ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ లిస్టులో అందరూ ఫ్రెండ్సేనా

ఒకటికి ఒక్కసారి కూడా 

ఆలోచించుకోనివ్వని ఆదుర్దా

మన టైంలైన్లోనే టైం బేడవ్వడానికి

రంగం సిద్ధం చేస్తుంది

మెసెంజరో ్లదూరి హాయ్‌ అని పలకరించే నేస్తం

చీకట్లో ఏ హాయ్‌ హాయ్‌ గీతాలు రచిస్తుందో


3. 

కొండ అంచు మీద నిలబడి

లోయని చూపిస్తూ కాలాన్ని బంధిస్తున్న క్షణం

కదిలే రైలుకిటికీకి వేలాడుతూ

సరదాగా మరణాన్ని ముడ్డిగిల్లి లేపడం

పాడె మీది పీనుగుని స్టేటస్‌ పెట్టి

ఇష్టాన్ని చెప్పమంటున్న సందర్భం

ఇలా మైకం కమ్మినట్టు పోస్ట్‌ కింద వేలాడే

ఒకేఒక్క కామెంట్‌ తాలూకు 

సమ్మోహనం వెనక 

మూమెంటేమిటో ఎవరికి తెలుసు

ఒక్క లైక్‌ కోసం

ఒళ్ళు నగ్నమౌతున్న కాలంలో

ఎక్కడ ఏ బూచీ దాగివుందో ఏం చెప్పగలం

సూదిమొనంత ఏమరుపాటును ఒరుసుకుంటూ

సుతిమెత్తగా ప్రమాదం 

మనతో సెల్ఫీదిగి వెళ్ళిపోవచ్చు

బంగార్రాజు

85003 50464

Updated Date - 2021-08-09T06:27:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising