ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

థాంక్యూ సీజే సార్‌!

ABN, First Publish Date - 2021-07-16T08:12:43+05:30

భారత ప్రధాన న్యాయమూర్తి పదవీ స్వీకారానంతరం జస్టిస్‌ ఎన్‌.వి. రమణ గారికి శుభాకాంక్షలు తెలుపుతూ నా రచనలు కొన్ని వారికి పంపాను...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భారత ప్రధాన న్యాయమూర్తి పదవీ స్వీకారానంతరం జస్టిస్‌ ఎన్‌.వి. రమణ గారికి శుభాకాంక్షలు తెలుపుతూ నా రచనలు కొన్ని వారికి పంపాను. తెలుగు భాష పట్ల, సాహిత్యం పట్ల రమణ గారికి గౌరవం ఎక్కువ అని తెలిసి కొందరు సాహితీవేత్తలు, ప్రముఖుల నుంచి నేను పొందిన లేఖలను కూడా నా రచనలతో జత చేసి పంపాను. వాటిలో తెన్నేటి, వావిలాల, సినారె, ఆవుల సాంబశివరావు, సంజీవదేవ్‌, సరోజా శ్రీశ్రీ, పిబి శ్రీనివాస్‌, పొత్తూరి, తుర్లపాటి, గరికిపాటి, పి.ఉపేంద్ర, పాల్కీవాలా, ఎం. వెంకయ్యనాయుడు వంటి వారి లేఖలున్నాయి.


‘‘మహనీయులెందరో మీతో లేఖల ద్వారా స్వదస్తూరితో పంచుకున్న ఆలోచనలు చూసి, చదివే భాగ్యం కలిగించినందుకు కృతజ్ఞతలు. ఈ అమూల్య సంపదను పరిశోధకుల ప్రయోజనార్థం ఏదైనా విశ్వవిద్యాలయంలో భద్రపరిస్తే మంచిదని భావిస్తాను’’ అంటూ జస్టిస్‌ ఎన్‌.వి. రమణగారు నాకు ప్రత్యుత్తరమిచ్చారు. క్షణం తీరిక లేకుండా ఉండే దేశ అత్యున్నత న్యాయస్థానపు ప్రధాన న్యాయమూర్తి ఇలా సామాన్యుల పట్ల చూపుతున్న సౌమనస్యం, ఔదార్యం వారి సంస్కారానికి, సహృదయతకు అద్దం పడుతున్నాయి. అందుకు వారికి ధన్యవాదాలు.

మైలవరపు రామమూర్తి, రాజమహేంద్రవరం

Updated Date - 2021-07-16T08:12:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising