ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆదివాసీ కళలపై తెలుగు వర్శిటీ పీఠం

ABN, First Publish Date - 2021-02-23T06:13:32+05:30

తెలంగాణ ఏర్పడిన తరువాత కూడా హైదరాబాద్‌లో ‘శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం’ కొనసాగుతున్నది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తెలంగాణ ఏర్పడిన తరువాత కూడా హైదరాబాద్‌లో ‘శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం’ కొనసాగుతున్నది. ఈ విశ్వవిద్యాలయంలో పనికి వచ్చే కోర్సులు ఆంధ్రలోని రాజమండ్రిలో పెట్టి, తెలంగాణ ప్రజల కళలు, సంస్కృతి ప్రతిబింబించని కోర్సులు మృదంగం, భరతనాట్యం, లలిత సంగీతం వంటి కోర్సులు హైదరాబాద్ కేంద్రంగా కొనసాగిస్తున్నారు. ఇక్కడి సంస్కృతికి సంబంధం లేని, ఇక్కడివారికి ఏమాత్రం ఉపయోగపడని కోర్సులు కొనసాగించే బదులు ఆదిలాబాద్‌లో ఒక పీఠాన్ని ఏర్పాటు చేసి ఆదివాసులకు సంబంధించిన కళలు, సాహిత్యాన్ని అభివృద్ధిపర్చాలి. గోండులకు ప్రత్యేకమైన సంగీతం విభిన్న సంగీత పరికరాలున్నయి. ఏనాడు ఏ యూనివర్శిటీ వీటి గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. వీటిపై అధ్యయనం కూడా చేయలేదు. ఆదివాసీ గోండు కళాకారుడు కనకరాజు గుస్సాడి నృత్యంలో పద్మశ్రీ పొందడం గర్వించదగ్గ విషయం. ఆ నృత్యానికి అంతటి ప్రాధాన్యం ఉన్నది కాబట్టి ఆ కళ అంతరించిపోకుండా ఉండాలంటే విశ్వవిద్యాలయం పీఠం అవసరం ఎంతైనా ఉన్నది. అందువల్ల తెలంగాణ ఆదివాసీ సంస్కృతి, కళలు, భాషలను బతికించుకోవడానికి, పరిశోధనలు చేయడానికి ప్రత్యేక పీఠాన్ని ఏర్పాటు చేయాలని ఆదిలాబాద్ జిల్లా అధ్యయన వేదిక డిమాండ్ చేస్తున్నది.

బి.వేణుగోపాల్ రెడ్డి, ఆదిలాబాద్‌

Updated Date - 2021-02-23T06:13:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising