ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలుగు యూనివర్సిటీ పరువు తీసే నియామకం

ABN, First Publish Date - 2021-02-18T06:08:21+05:30

భాషాసాహిత్యాల పేరిట నెలకొల్పిన విశ్వవిద్యాలయాలలో ఆ రంగాల్లో సుప్రసిద్ధులను, విస్తృతంగా పరిశోధనలు రచనలు చేసినవారిని...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భాషాసాహిత్యాల పేరిట నెలకొల్పిన విశ్వవిద్యాలయాలలో ఆ రంగాల్లో సుప్రసిద్ధులను, విస్తృతంగా పరిశోధనలు రచనలు చేసినవారిని ఆచార్యులుగా, ఉపకులపతులుగా నియమించాలి. అలాంటివారు ఆయా భాషలను, సాహిత్యాలను సర్వతోముఖంగా తీర్చిదిద్ది, సంఘానికి అందించగలుగుతారు. భాషతో, సాహిత్యంతో ఎలాంటి సంబంధం లేని వారిని ‘సెర్చ్‌ కమిటీ’ సభ్యులుగా వేయటం యూనివర్సిటీ లక్ష్యాలకు విరుద్ధమే. యూనివర్సిటీ సెర్చ్ కమిటీకి ఇటీవల నామినేట్ అయిన సిద్ధిఖీ గొప్పవారే కావచ్చు. కాని తెలుగు భాషతో, సాహిత్యంతో ఆయనకున్న పరిచయం ఏమిటి? ఆయన ఎలాంటి పేర్లు సూచించగలడని తెలుగు యూనివర్సిటీ సెర్చ్‌ కమిటీకి నామినేట్‌ చేసినట్లు? తెలుగు భాషంటే, సాహిత్యమంటే ఎంతో మక్కువ ఉన్న కేసీఆర్ హయాంలో విద్యారంగంలో, అదీ విశ్వవిద్యాలయ రంగంలో ఇలాంటివి జరగడం దురదృష్టకరం. రానూ రానూ సంస్థల కొరకు మనుషులా, మనుషుల కొరకు సంస్థలా.. అర్థం కావడం లేదు. నేను ఒకప్పుడు తెలుగు యూనివర్సిటీ ఫార్మేషన్‌ కమిటీకి ఫౌండర్‌ మెంబర్‌ కన్వీనర్‌గా కూడా ఉంటిని. దాని గురించి రాయడానికి చాలానే ఉంది. కానీ ఈ మధ్య ‘సెర్చ్‌ కమిటీ’కి చెందిన ఒక ఆదరబాదర ‘మార్పు’ గురించి విని కడుపు కాలి ఇది మాత్రం రాసి ముగిస్తున్నాను.

డాక్టర్‌ వెల్చాల కొండలరావు

పూర్వ సంచాలకులు, తెలుగు అకాడమీ

Updated Date - 2021-02-18T06:08:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising