ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆమె అట్లా వెళ్లిపోయింది...

ABN, First Publish Date - 2021-02-15T05:49:36+05:30

నేనన్నాను.. ఇక యుద్ధం చేయలేనని.. ఆయుధం ఎత్తలేనని వయసు మబ్బులు క్రమ్మిన ఈ దీర్ఘ చుంబనాలకు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నేనన్నాను..

ఇక యుద్ధం చేయలేనని..

ఆయుధం ఎత్తలేనని

వయసు మబ్బులు క్రమ్మిన ఈ

దీర్ఘ చుంబనాలకు

కొత్త భాష్యం చెప్పలేనని


ఆమె నా మాటలు నమ్మలేదు

ఆమెలోని ఒక వివశత నా పట్ల వివరించలేని ఆర్తి

కంటి నీటిని నిమజ్జనం చేయలేని

అట్లాగని ప్రదర్శించలేని

ఆమె అశక్తత నేను గుర్తించాను


నిజానికి ఆమె నాకన్నా అందమైనది

ఒక్క చిరునవ్వుతో వేల

ఉదయాలు పూయించగలిగినది

క్షమా సంతకంతో రహస్తీరంలో 

ప్రాణదీపం వెలిగించగలిగినది

సమాజావధులకావలి తీరం వైపు

ఎగిరే కొత్త రెక్కలు

ఏ క్షణానికాక్షణం ధరించగలిగినది


చివరికి ముడులన్నీ

విడగొట్టిన వాక్యాన్నై

అనుభవం నిండిన సిరంజిని సిద్ధం చేసి

ఆమెని చూశాను


ఏ నిరీహ ఫలించిందో

తారట్లాడే ఏ జ్ఞాపకం కదలించిందో

ఎన్ని ఏకాంత దుఃఖపు

అవ్యక్త వాస్తవాలు

ఆమెను ఎంతగా మౌనీకరించాయో


ఆమె లేచి చివరగా

నన్ను చుంబించింది.

వెనక్కి చూడకుండా

అట్లా వెళ్లి చీకటిలో కలిసిపోయింది.


వసంతాన్ని చూడలేని

నా కోకిల పాట

మరో దారిలేక కవిత్వం

కలుగులో దూరిపోయింది.

కాంచనపల్లి గోరా

96760 96614


శివారెడ్డి ‘కొంచెం స్వేచ్ఛగావాలి’ కవితా సంపుటి ఇంగ్లిష్‌ అనువాదం

కె. శివారెడ్డి తాజా కవితా సంపుటి ‘కొంచె స్వేచ్ఛగావాలి’ (2019)కి ఎమ్‌. శ్రీధర్‌, అల్లాడి ఉమల ఇంగ్లీషు అనువాదం 'need a bit of freedom’ ఈ నెలాఖరుకు హావాకల్‌ పబ్లిషర్స్‌ (న్యూఢిల్లీ ్క్ష కోల్‌కత) ద్వారా ప్రచురితం కానుంది. 

ఎమ్‌. శ్రీధర్‌

Updated Date - 2021-02-15T05:49:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising