ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లోకం చుట్టిన నొవ్వి నవ్వు!

ABN, First Publish Date - 2021-08-02T09:57:43+05:30

కడుక్కుపోయిన కాలంలో మాంసం కొన్న వేటగాళ్ల కోసం పంటికి వజ్రం తొడుక్కునే నవ్వులో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడుక్కుపోయిన కాలంలో 

మాంసం కొన్న వేటగాళ్ల కోసం

పంటికి వజ్రం తొడుక్కునే నవ్వులో

నాలుకకి అందిన వరాలు


బాటసారికి వసంతరాగం వినిపించిన

కుత్తుకలు... పరిమళాలు పరిచిన నాపలు

అగుపడని వేళ్ళ వణుకు.. అభాండపు కన్నులు,

పగలు రేయి పదునులు... కీలుబొమ్మలు...


రోజు లేని రవి.. రవి లేని రోజు...

శిశిర రుతువు రాత్రులు.. పొట్టి చెంచలాలు

మోదుగు పూలకాలం... వెచ్చని స్పర్శ

కళ్ళూ కళ్ళూ కలిసి రసి... వేడి చూపులు

తెగిపడిన పగడాల దండ తుళ్ళింతలో...

దారం, భ్రమరం తిరుగుబోతయి... 


వాడిపోయిన తీగని పట్టుకు వదలని భవనం,

పాత తలపులని మత్తులో పాడుకున్న మేడ...

రాత్రి ముద్రలు... సిగ్గుల్లో గిచ్చుకొని... ఎండి

పోయిన పూలదండల చాటున చంద్రుడు...

చెయ్యి వదిలితే విరిగిపడ్డ పసిస్థానం,

కోసి కోసి రంపం పొట్టులా కోర్కెల జల్లులు...

బతుకులో, తెగి చచ్చి బతికిన జీవంలో 

  కళ... కళలు


వేలిముద్రల తోలు మీద, మాలో... మాతో కాలం,

దోసిట్లో నీళ్ళూ.. పౌరుషం ఉంటే ఖాళీ రాత్రులే

తోడు...

ఆ కోడికూతల కాలం... జండా ఎగరవేసి...

కంటిరెప్ప పైకి ఎత్తడం... కోటి రాగాల ఉదయం. 

మన్నం సింధు మాధురి

87909 06686


Updated Date - 2021-08-02T09:57:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising