ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఒప్పందం పేరుతో శ్రమదోపిడీ

ABN, First Publish Date - 2021-08-06T06:11:28+05:30

ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా సేవలందిస్తున్నా ఒప్పంద ఉద్యోగులకు వారితో సమానంగా వేతనాలు మాత్రం అందడం లేదు. 20 ఏళ్లుగా పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులందిరినీ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా సేవలందిస్తున్నా ఒప్పంద ఉద్యోగులకు వారితో సమానంగా వేతనాలు మాత్రం అందడం లేదు. 20 ఏళ్లుగా పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులందిరినీ అర్హత, సర్వీసుల ప్రాతిపదికగా క్రమబద్ధీకరిస్తామన్న హామీతో గద్దెనెక్కిన ప్రభుత్వాలు ఏవో సాకులు చూపిస్తూ కాలయాపన చేస్తున్నాయి. ఇది కాంట్రాక్టు పేరుతో కట్టుబానిసలుగా మార్చి సమర్థత గల వ్యక్తులను శ్రమదోపిడీకి, అణచివేతకు గురిచేయడమేనని సర్వోన్నత న్యాయస్థానం పలు సందర్భాల్లో వ్యాఖ్యానించినా ప్రభుత్వాలు పట్టించుకోవడంలేదు. రెగ్యులర్ ఉద్యోగ ప్రకటనలు వెలువడని నిస్సహాయ పరిస్థితుల్లోనే నేటి యువత ఒప్పంద ఉద్యోగాలలో చేరుతున్నారు. ౮వ తరగతి అర్హతతో శవపరీక్షల అసిస్టెంటు ఉద్యోగానికి ఇటీవల 8వేల మంది నిరుద్యోగులు దరఖాస్తు చేశారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. రెగ్యులర్ ఉద్యోగులతో సమానమైన అర్హతలున్న ఒప్పంద ఉద్యోగులు అన్ని విభాగాల్లోనూ దాదాపు 20 ఏళ్ల అనుభవం సంపాదించారు. పాలనాసంస్కరణల పేరుతో రెగ్యులర్ ఉద్యోగులను తగ్గిస్తూ ఒప్పందం మాటున నిరుద్యోగుల శ్రమను దోపిడీ చేసే విధానాలను పాలకులు విడనాడి వెంటనే వారిని క్రమబద్ధీకరించాలి.

దుగ్గివలస రామ్ ప్రసాద్

పాలకొండ, శ్రీకాకుళం జిల్లా

Updated Date - 2021-08-06T06:11:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising