ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కష్టంగా వుంది

ABN, First Publish Date - 2021-01-11T07:24:20+05:30

ఏ పక్షి ఎలా ఎగిరివెళ్లిపోతుందో తెలియట్లేదు కళ్లు మూసి కళ్లు తెరిచేలోపే ఒక్కొక్క పక్షీ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏ పక్షి ఎలా ఎగిరివెళ్లిపోతుందో

                  తెలియట్లేదు

కళ్లు మూసి కళ్లు తెరిచేలోపే

ఒక్కొక్క పక్షీ

అంతూ దరీ లేని తీరానికి

                 చేరిపోతుంది

పక్షి మిగిల్చిన ఖాళీ

కొమ్మ మీద రాత్రిపవళ్లూ

    అలా వేలాడుతూనే వుంటుంది

అల్లంత దూరం నుంచి

అందనంత దూరం నుంచి

ఉబ్బిన చూపుని ఖాళీ కొక్కేనికి వేలాడదీసి

నిష్ర్కియాత్మకంగా వుండిపోవటం

విషాదం

ఒకే చెట్టు ఆసరాగా బతికి

చెరోదిక్కున నిశ్చేష్టగా మిగిలిపోవటం

తీరని దుఃఖం

చివరి చివరి వీడ్కోలులోనైనా

దగ్గరగా లేకపోవటమే

           దూరమవటం


ఒకే కొమ్మ పక్షులను

    ఆర్తిగా కలవనివ్వని కాలం

ఎంత కఠినమైనది


ఏ పక్షి ఎలా ఎగిరి వెళ్లిపోతుందో

ఏ రెక్క ఎక్కడ

   విరిగి పడిపోతుందో

గుర్తించటం అసాధ్యమౌతుంది


ఊహించిన దారులలో 

  ఊహించని మలుపులు

తెగి చెల్లాచెదురైన

  అడుగులలో నడవటం

సర్వసాధారణమౌతుంది


ఇప్పుడు

రెక్కతెగిన పక్షులనూ

    కన్నీళ్లొలికే పక్షులనూ

ఎలా ఓదార్చాలో

     ఎలా కాపాడుకోవాలో

అంతా శూన్యం 

     కష్టంగా వుంది


ఒక్కమాటైనా చెప్పకుండా

వెళ్లిపోయిన పక్షులు వదిలిన శూన్యం వైపు

చూస్తూ చూస్తూ

వెళ్లినా వదిలిపోని జ్ఞాపకాలలో సేదతీరటమే

కొన్నిసార్లు ప్రతిక్రియేమో


ఎదురునిలిచే ముందు

ఎదురుచూడటం అవసరమని

అమ్మ చెబుతుంది

బాలసుధాకర్‌ మౌళి

96764 93680

Updated Date - 2021-01-11T07:24:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising