మంచు పూల దారుల్లో
ABN, First Publish Date - 2021-01-18T10:18:58+05:30
మంచు కురిసే నేలమీద సంబరంగా నడిచిన అనుభవం నాది ఎండా వానా తప్ప, మంచు చూడని...
మంచు కురిసే నేలమీద
సంబరంగా నడిచిన అనుభవం నాది
ఎండా వానా తప్ప,
మంచు చూడని South India అమ్మాయిని నేను
మంచు కురిసే భూలోక స్వర్గ మొకటి వుంది నా మాతృభూమిలో
అది కాశ్మీర్, దూరమైంది ఆ నేల అనివార్య కారణాల వల్ల
పరాయి నేల మీద ఆ feelingని భద్రంగా దాచుకున్న నయనం నాది
ఆకాశం నుంచి మల్లెపూలు జాల్వారుతున్నట్టు
బూరుగ దూది కాయలు చెట్టు మీదే పగిలి
గాలికి దూది ఊరంతా వ్యాపించినట్టు
గాలిలో తేలుతూ మంచు తునకలు
నా మీద కురిసిన మంచుపూల జల్లు
నన్ను పాలరాతి శిల్పాన్ని చేసింది
ఒక crystalized dream నా మీద ప్రవహిస్తున్నట్టు అనిపించింది
హిమనీ దారుల స్వప్న లోకాన్ని వీక్షించిన సంబరంలో
మంచుతెర కప్పుకుంది ఆకాశం ఎటు చూసినా హిమరాసుల సోయగాలే కనుచూపు మేరంతా శ్వేత సౌందర్యమే మంచు రాసుల architecture
వైట్ క్రిస్మస్ అందాన్ని మోసుకొచ్చిన snowfall ఈ అద్భుత సౌందర్యాన్ని కానుకగా ఇచ్చిన ఆకాశాన్ని చూడాలని తల పైకెత్తాను, అంతే ! నా కళ్ళలో కురిసిన రెండు మంచుమొగ్గలు
మంచుపూల వాన, నా ఇంటి ఆవరణలో తెల్లని తివాచి పరిచింది నా అద్దాల కిటికీ మీద కురిసి, హిమ బిందువుల్ని మిగిల్చి నగీషీ చెక్కిన తలుపు గుమ్మం ముందు కుప్పగా మిగిలింది నా ఇంటి backyard వైపు చిన్న సరస్సు మంచు గడ్డయి కూర్చుంది నయాగరా జలపాతం ఘనీభవించి abstract చిత్రమైంది
ఆకాశాన్ని తాకే చీనార్ వృక్షాలు మంచు కప్పిన అనేక ఆకృతులు
కొమ్మ కొమ్మకు పూసిన మంచు ముత్యాలు Art Gallery లో తిరుగుతున్న భ్రాంతి
చిరు సవ్వడి లేని శాంతివనంలో
ఈ శ్వేతవర్ణ చిత్రాల్ని మైమరచి చూసాను మాట రాని వివశత్వంలో
అలా నిలబడిపోయాను మంచు మైదానంలో
(the beauty of Canada snowfall during my stay)
Updated Date - 2021-01-18T10:18:58+05:30 IST