ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అనామకంగా వెళ్ళిపోయావా..!

ABN, First Publish Date - 2021-06-25T09:19:44+05:30

అన్నయ్యా! ఎక్కడో మారుమూల చిత్తూరు జిల్లా సోమల మండలం ఆవులపల్లి గ్రామంలో పుట్టి తల్లిదండ్రుల బాధ్యతని నీ భుజస్కంధాలపై వేసుకుని నలుగురు అన్నదమ్ములతోపాటు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అన్నయ్యా! ఎక్కడో మారుమూల చిత్తూరు జిల్లా సోమల మండలం ఆవులపల్లి గ్రామంలో పుట్టి తల్లిదండ్రుల బాధ్యతని నీ భుజస్కంధాలపై వేసుకుని నలుగురు అన్నదమ్ములతోపాటు మరో నలుగురిని చేరదీసి పెంచి పెద్ద చేస్తివి. కుటుంబం నిన్ను చదువుకు దూరం చేసిందని తమ్ముళ్ళను మహోన్నతంగా చదివించి మురిసిపోయావు. ఆవులపల్లె నుంచి తిరువయూరు దాక విస్తరించుకుంటివి. సంగీతాన్ని సరళీవరసలతో మొదలుపెట్టి జంటస్వరాలు, దాటు స్వరాలు, పిల్లారిగీతాలు, వర్ణాలు, కీర్తనలు, రాగాలతో ఆడుకుంటివి. వంద వర్ణాలు పాఠం చెయ్యకుంటే వాడు విద్వాంసుడే కాదని వాదిస్తివి. త్యాగయ్యతో రాగాలాపన చెయ్యడానికి వెళ్ళావా? క్షేత్రయ్యతో చెట్టాపట్టాలేసుకుని తిరగడానికి వెళ్ళావా? ముత్తుస్వామితో ముద్దు ముద్దుగా మాట్లాడటానికి వెళ్ళావా? ఎక్కడికి వెళ్లావు? రాత్రులు రాత్రులు సంగీత కచ్చేరీలలో గడిపేవాడివి. ఎందర్ని చేరదీశావు. ఎందరికి అన్నం పెట్టావు. ఎందరికి ఉపాధి చూపావు. ఇప్పుడు వాళ్ళంతా ఎక్కడా కనిపించరేమి? నీ రక్తం పంచుకు పుట్టిన నీ అన్నదమ్ములు కూడా ఎవరూ నీ దగ్గర లేరేమి? ఈ దుర్మార్గపు మరణమేమి? నీతో కలిసి తిరిగిన నీ స్నేహితులెక్కడ? నువ్వు నడిపించిన నీ శిష్యులెక్కడ? ఒకరా ఇద్దరా వందల సంఖ్యలో ఉంటారే. వారేరీ ఈనాడు కనిపించరేమి? కరోనా మహమ్మారి అందర్నీ కట్టడి చేసిందా!?


ఎందరెందరి గురించి మాట్లాడేవాడివి- మహా చక్రవర్తి తిరువాడ దురై రాయరత్నం, కక్కయ్య, వీరుస్వామి, కారుకుర్బె, నామగిరిపేట, వడివేలు, పలణివేలు, కలియమూర్తి, వలయపట్టు, ముత్తు కుమార స్వామి, వాసుదేవన్... ఇలా ఎందరి గురించి చెప్పేవాడివి. ఇంట్లో అందరికీ సంగీతం నేర్పించాలని కలలు కన్నావే. అందరికీ సంగీత జ్ఞానం ఉందని మురిసిపోయావే. ఎక్కడికి వెళ్ళిపోయావన్నా మమ్మల్ని కన్నీటి సంద్రంలో ముంచి... ఈ కన్నీటి రాతలు రాయడానికేనా మమ్మల్ని పెంచి పెద్ద చేసింది. 

నీ తమ్ముడు

తుమ్మల రామకృష్ణ

ఉపకులపతి, ద్రావిడ విశ్వవిద్యాలయం

Updated Date - 2021-06-25T09:19:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising