ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దొరకని తలుపు

ABN, First Publish Date - 2021-03-29T07:47:14+05:30

పదం ఎగిరిపోతోంది. ఎగరని ఖననం. ఎందుకో ఎవరో చూసిన నిశ్శబ్దం. అప్పనంగా. అర్ధనగ్నంగా. అక్షరాలన్నీ సంపూర్ణ నగ్న అక్షరాలేనా. శరీరానికే అక్షరం...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పదం ఎగిరిపోతోంది. ఎగరని ఖననం. ఎందుకో ఎవరో చూసిన నిశ్శబ్దం. అప్పనంగా. అర్ధనగ్నంగా. అక్షరాలన్నీ సంపూర్ణ నగ్న అక్షరాలేనా. శరీరానికే అక్షరం. తొడుగు. తొడుగు. తొడలే లేని రాత్రి. గదిలో, ప్రేమతో విలపించకు. అదో విషం. అదో నిష. తత్వవేత్త వెలిగించే మాటలు మూర్ఖంగా కనిపించలేదా.

ఎన్ని చెవులు నీలో.

ఎన్ని నాలుకలు నీలో.


దారితప్పి

వొచ్చిన ఇంద్రియాలతో

నువ్వే శరీరాన్ని వెతుకుతూ ఉంటావ్‌.

తలలూపే అక్షరాలమధ్యే ఇంకెంత కాలం

ముద్దుముద్దుగా ముద్దగా.


కాని సొంత రచన, ఓ సొంత విసుసుసుసుసుసుసుగు మనసు. అంతకన్నా ఏ కంటి కలా లేదుదుదుదుదు. కొన్ని అక్షరాలు ఈ కాగితంపై కనిపించక పోతే చాలు.


కలలో ఉండని నిద్ర

నిద్రలో వుండని కలే కావాలి.

చనిపోయే చీకటినే చూడాలి.


రాదు. మరో మనసు. ఒక మనసే. ఎన్ని అంగాలో. ఎవరి అంగాలో. అంగాంగాల మనసు. నీదే. కానే కాదు.


మరో రాత్రిలోకి, రాత్రే రాకపోతే, రాత్రే, ఎక్కడో. అదే దారం. అదే అద్దం. అదే పేగు. అదే ముఖం. అదే నిశ్శబ్దం కాదు. ఎన్నటికీ.


ఈ పదాల బయట బయట ఏదీ కనిపించదు. దాయాలి. గాయాలని గుండెకి నేర్పాలి.


కలలు తెరిచే కళ్ళతో

కోవిడ్‌ రాత్రి ఇంకా వుంది.


ధ్యానం, ధ్యాస

ఆలోచనల రొంపి కోసమేనా.

ఎం. ఎస్‌. నాయుడు

Updated Date - 2021-03-29T07:47:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising