ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఢిల్లీ పెద్దల తప్పూ ఉంది!

ABN, First Publish Date - 2021-11-25T06:57:56+05:30

రాజధాని లేని రాష్ట్రానికి అందరి ఆమోదంతో అమరావతిని రాజధానిగా నిర్ణయించారు. అమరావతిని అభివృద్ధి చేస్తూ రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల అభివృద్ధికి కూడా అనేక సంస్థలను గత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ఏర్పాటయిన కొత్త ప్రభుత్వం అనేక అసత్య, ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజధాని లేని రాష్ట్రానికి అందరి ఆమోదంతో అమరావతిని రాజధానిగా నిర్ణయించారు. అమరావతిని అభివృద్ధి చేస్తూ రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల అభివృద్ధికి కూడా అనేక సంస్థలను గత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ఏర్పాటయిన కొత్త ప్రభుత్వం అనేక అసత్య, ఆధారరహిత ఆరోపణలతో అమరావతి నిర్మాణాన్ని అర్ధంతరంగా ఆపివేసి మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకువచ్చింది. ఈ ప్రతిపాదనకు హేతుబద్ధత లేదు. ఏ ఇతర రాజకీయ పార్టీ కూడా ఈ అసంబద్ధ నిర్ణయాన్ని ఆమోదించలేదు. ఇప్పుడు అదే నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని మరేదో మెరుగైన బిల్లును తీసుకువస్తామని ప్రభుత్వం చెప్పడం హాస్యాస్పదం, బాధ్యతారాహిత్యం కూడా. కేంద్రం కూడా ఈ విషయంలో బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిందనే చెప్పాలి. జగన్‌ సర్కార్‌ నిర్ణయంలో తమకు సంబంధం లేదని చెప్పడం దుర్మార్గం! అసలు రాష్ట్రాన్ని విభజించింది కేంద్రమే. అలాంటప్పుడు రాజధానిని నిర్మించి ఇవ్వవలసిన బాధ్యత కూడా కేంద్రానిదే! ఈ ప్రతిపాదన సరికాదని కేంద్రం, రాష్ట్రానికి ఒక మాట చెప్పి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు? ఇప్పుడు రాష్ట్రానికి జరిగిన, జరుగుతున్న నష్టానికి బాధ్యులెవరు? కేంద్రం, ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వమే ఈ బాధ్యత తీసుకుని, ఇప్పటికైన రాష్ట్రం శీఘ్రగతిన అభివృద్ధిచెందేందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలి.


                                                                                                                   గరిమెళ్ళ రామకృష్ణ

                                                                                                       ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లా.

Updated Date - 2021-11-25T06:57:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising