ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కర్ఫ్యూ!

ABN, First Publish Date - 2021-05-10T06:16:05+05:30

నిన్నటి పాదముద్రలు చెరిగిపోయాయి. రాకాసి అలల రాకపోకలతో తీరమంతా కర్ఫ్యూ!...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిన్నటి పాదముద్రలు చెరిగిపోయాయి.

రాకాసి అలల రాకపోకలతో

తీరమంతా కర్ఫ్యూ!


పున్నమి పువ్వు చెదిరిపోయింది.

చిక్కగా చీకటి వికసిస్తుంటే

ఆకాశమంతా కర్ఫ్యూ!


మొలకెత్తాలనే ఆశ మోడుబారింది.

వేరు కుంపట్లు పెట్టుకున్న వేర్లు వెళ్ళిపోయాయి

నేలమాళిగ అంతా కర్ఫ్యూ!


అహానికి అంతులేని దాహం.

పట్టువిడుపులు లేకుండా పయనిస్తే

మది గదిలో కర్ఫ్యూ!

కుడికాల వంశీధర్‌

98852 01600


Updated Date - 2021-05-10T06:16:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising