ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చలి పూలు, మూర

ABN, First Publish Date - 2021-12-20T05:30:00+05:30

బల్బు వెలుతురును బల్లి కొద్దికొద్దిగా నంజుకుంటున్న వేళ చొక్కా బొత్తాలు విప్పి ఆకాశంలోకి చూస్తే...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

1

బల్బు వెలుతురును బల్లి కొద్దికొద్దిగా నంజుకుంటున్న వేళ చొక్కా బొత్తాలు విప్పి ఆకాశంలోకి చూస్తే... పగిలిన చీమలపుట్టలా నక్షత్రాలు చక్కెర గడ్డలా చంద్రుడు చలికి వణుకుతూ పైటతొలగిన పైరగాలి ముడవని మల్లెచెండులా పొద మనోవ్యాప్తమైన పరిమళం ఇప్పుడు ఇద్దరం వేర్వేరు కాదు రెండొకట్లు ఒకటే.


2

చంద్రుడు చెరువులో వేశాడు వెన్నెల గేలం సొగసైన మత్స్య కన్య అలిగి, పెదవి విరిచి.. అటు తిరిగి తోకూపింది వీళ్ల సరసాన్ని చూసి సిగ్గుపడిన నీళ్లు తటాకాన్ని తరంగాలతో తడిమాయి.

3

ప్రపంచం చూస్తోందని సిగ్గిల్లి, మేఘాల తొడల మధ్య.. ముఖం చాటేశాడు, చంద్రుడు చలి గాయాలు గరుగ్గరుగ్గా, రేయంతా సలపరిస్తూనే వున్నాయి!

4

పళ్లు గిట్టకరుచకుని గజగజా వణుకుతోంది గాలి బిక్కచచ్చిపోయి గుడ్లు మిటకరించి చూస్తోంది, నిదురెరుగని ఒంటరి గువ్వొకటి గూట్లోంచి. హేమంతపు పంతానికి రాలిపోతానేమోనని బెంగటిల్లి ఒక చేతిలో మరో చేతివేళ్లను జొనిపి పందిరిని పెనవేసుకుంది, పూతీవె

5

ధనుర్మాసపు వేళ చెరుకువింటి సవ్వడులు సడిలాక మునివేళ్లపై పైకి లేచి చీకటి చెరను చీల్చే కిరణం కోసం.. అలసటగా దక్షిణం వైపు దృక్కులు సారించింది, కాటుక కళ్లతో చీకటి. రాతిరంతా చేసిన వెధవ పని అందరికీ తెలిసిపోయిందనేమో వేషం మార్చుకున్న చంద్రుడు ఉక్రోషంతో ఎర్రబడిన ముఖంతో.. అల్లంత దూరం నుంచి చూసీచూడనట్టు ఓ చూపు విసిరాడు చివరి నిట్టూర్పు విడిచి, చీకటి పక్కకు ఒత్తిగిల్లింది.


దేశరాజు

Updated Date - 2021-12-20T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising