ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బతుకమ్మ దీవెన

ABN, First Publish Date - 2021-10-07T06:26:00+05:30

బతుకమ్మ ఓ ప్రత్యేక సుమాలతో పేర్చిన ఉమ్మడి కుటుంబ కలయిక రంగు రంగుల పూల అల్లికలో వర్ణ రహిత మానవ సంకేత గీతం వాగ్గేయకారుల గానంలో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బతుకమ్మ 

  ఓ ప్రత్యేక సుమాలతో పేర్చిన 

    ఉమ్మడి కుటుంబ కలయిక

రంగు రంగుల పూల అల్లికలో 

వర్ణ రహిత మానవ సంకేత గీతం

వాగ్గేయకారుల గానంలో 

  పరిమళించిన నిస్వార్థార్ధ 

   పల్లెల ఆత్మీయ పండుగ 

    బతుకమ్మ

ఈర్షాద్వేషాలు కడు దూరం ఇక్కడ

ఏ గందరగోళం లేని 

 స్వచ్ఛమైన మనసు 

  ఆట పాటల సౌందర్యం  


ఆ అపూర్వ సాంస్కృతిక కళలన్నీ ఏవి, 

  కానరావేల నేడు మరి

మర లయలో భ్రమిస్తున్న మనిషిలో 

ప్లాస్టిక్ పూల వాసనే అంతా

రోబోల చేతుల్లో తాత్కాలికమే అది


బతుకమ్మ వేదిక 

  స్తాంబాళమో పళ్ళెమో శిబ్బో కదా

గుమ్మడి ఆకు పరిచిన విస్తరే అది

తంగేడు బంగారమైతే, వెండి కదా

గునుగు, ఇత్తడి రాతెండి పళ్ళాలు,

  శిబ్బి లేత వెదురు అల్లిక కళల  

    వేదికై మెరుసేది బతుకమ్మ

లోహాల, సుమ, పత్ర, బొంగు, 

  వన జీవ ప్రకృతి ఆకృతే కదా 

   అంతటా


నిన్నటి తంగేడు పూల క‌రచాలనం 

  గునుగు పూలతో నేడు ఏక్కడ?

మధ్యతరగతి మందహాసం ఏది? నయా దొరల 

  కబంధ హస్తాల బందీ

బతుకమ్మ మరో అలాయ్ బలాయ్

ఆ స్ఫూర్తి ఆ సృజన పాటలేవి నేడు

ఆడపడుచుల ఆనంద నాట్యాలు

మసకబారిన సుందర దృశ్యాలే

నాటి చైతన్యం ఇప్పుడు ఓ చింత

కోవిడ్–19లో మన ఆటలు ఎంత?

విపరీత వైపరీత్యాలు ఎన్నున్నా

బతుకమ్మ బతుకుతుంది కాలంలో


శిరశ్శిఖర భ్రమ వీడిన మనిషి 

నేలపై స్నిగ్ధ మనసుతో బతుకడం

అదే బతుకమ్మ దైవ దివ్య దీవెన

డా.టి.రాధాకృష్ణమాచార్యులు

Updated Date - 2021-10-07T06:26:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising