ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బాస నీకు దండమే...!

ABN, First Publish Date - 2021-09-09T06:15:16+05:30

పలక మీద గీసిన పదం లెక్క పలుకుల మీద వాలిన పాలపిట్ట లెక్క ఎంత సక్కంగుంటవే నా బాసమ్మ.. ఓ యాసమ్మ జమ్మిచెట్టు కొమ్మా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పలక మీద గీసిన పదం లెక్క

పలుకుల మీద వాలిన పాలపిట్ట లెక్క

ఎంత సక్కంగుంటవే

నా బాసమ్మ.. ఓ యాసమ్మ


జమ్మిచెట్టు కొమ్మా..

అక్షరాల రెమ్మా నువ్వు మాకు

బంగారానివే.. సింగారానివే


బుడిగజంగాల కథలలో

బాగోతపు వ్యథలతో

జానపదమై వర్ధిల్లిన

పాటక పూదోట

నా తెలంగాణ భాష

యాదగిరి యాది నా యాస


ఓరుగల్లునూ.. గుండెజల్లునూ

అలుముకున్న స్మృతి

శాతవాహన సప్తశతి

నా తెలంగాణ సంస్కృతి


ఏములవాడ రాజన్న, పాల్కురికి సోమన్న

బమ్మెర పోతన్న దీవించిన భాష మనది

కొమరంభీముడు ఎత్తిన

పిడికిలైంది నా భాష

సుద్దాల హనుమంతు గొంతెత్తిన

పాటైంది నా భాష


కాళోజీ కలం గీతై

దాశరథీ కలల రాతై

కన్నీటి చెలమల్ని

కవ్వించుకుంది నా భాష


మనసెరిగిన మాండలికమై

కన్నతల్లోలే అదుముకుంది

సొంత చెల్లోలే అలుముకుంది

నా తెలంగాణ మాట

తంగేడుపూల బాట


ఆపతీ సంపతీల

సోపతి కట్టిన నా బాస

తెలంగాణ తల్లి మెడలో

గొలుసుకట్టు నా యాస


పదహారణాల సొక్కమైన

బాస నీకు దండమే...!

తెలంగాణ గళంలోన చిక్కనైన

యాస నీకు దండమే...!!

డా. కటుకోఝ్వల రమేష్

Updated Date - 2021-09-09T06:15:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising