ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెట్టుబడి సాయం మింగుతున్న బ్యాంకులు

ABN, First Publish Date - 2021-06-23T05:32:44+05:30

‘రైతుబంధు’ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం, ‘పిఎం కిసాన్‌’ పేరుతో కేంద్ర ప్రభుత్వం రైతులకు పంట వేయడానికి ఉద్దేశించిన పెట్టుబడి సహాయాన్ని వారి సేవింగ్‌్స అకౌంట్‌లో జమచేస్తున్నాయి....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘రైతుబంధు’ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం, ‘పిఎం కిసాన్‌’ పేరుతో కేంద్ర ప్రభుత్వం రైతులకు పంట వేయడానికి ఉద్దేశించిన పెట్టుబడి సహాయాన్ని వారి సేవింగ్‌్స అకౌంట్‌లో జమచేస్తున్నాయి. కానీ బ్యాంక్‌ అధికారులు మాత్రం రైతులకు చెప్పకుండా ఆ సొమ్ముని పంట రుణాలకు చెల్లింపుల రూపంలో జమ చేసుకుంటున్నాయి. ఇది చాలా దారుణం. ప్రభుత్వం పంటలకి రుణాలు మంజూరు చేసి మూడు సంవత్సరాలుగా ఆ రుణాలు మాఫీ చేయకపోవడం వల్ల ఒక్కో రైతు రుణం వేల నుంచి లక్షల్లో పేరుకుపోయింది. పంట రుణం ఖాతా, సేవింగ్‌్స బ్యాంక్‌ అకౌంట్‌ ఒకే బ్యాంకులో ఉన్న లక్షల మంది రైతుల సొమ్మును వారికి చెప్పకుండా అధికారులే నగదు బదిలీ చేసుకుంటున్నారు. పెట్టుబడికి ఆసరా అవుతుందని ఆశలు పెట్టుకున్న రైతులని బ్యాంక్‌ అధికారులు నిండా ముంచుతున్నారు. ప్రభుత్వం వెంటనే రైతులకు పెట్టుబడి సొమ్ము అందేలా చర్యలు తీసుకోవాలి. అలాగే పంట రుణాలను వెంటనే మాఫీ చేయాలి.

రావుల రామ్మోహన్‌రెడ్డి

Updated Date - 2021-06-23T05:32:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising