‘ప్రకృతి వ్యవసాయం’ నినాదంతో బహుజన బతుకమ్మ
ABN, First Publish Date - 2021-09-30T06:33:25+05:30
ప్రకృతి–పర్యావరణం–ప్రత్యామ్నాయ ప్రజాసంస్కృతి అనే అంశాలను కేంద్రంగా చేసుకుని బహుజన బతుకమ్మను ఉద్యమంగా కొనసాగిస్తూ 2021నాటికి పదవ ఏడులోనికి ప్రవేశిస్తున్నాం....
ప్రకృతి–పర్యావరణం–ప్రత్యామ్నాయ ప్రజాసంస్కృతి అనే అంశాలను కేంద్రంగా చేసుకుని బహుజన బతుకమ్మను ఉద్యమంగా కొనసాగిస్తూ 2021నాటికి పదవ ఏడులోనికి ప్రవేశిస్తున్నాం. భూస్వామ్య–సామ్రాజ్యవాద దోపిడీ పీడనల మూలంగా ఇటు దీర్ఘ కాలంగా ఎదుర్కొంటున్న వ్యవసాయ సంక్షోభం, అటు రెండేళ్లుగా కొనసాగుతున్న కరోనా బీభత్సాల నడుమ పెట్టుబడి భారం తగ్గించడం దిశగా రక్షిత ఆహారాన్ని అందిపుచ్చుకునే లక్ష్యంగా ప్రకృతి వ్యవసాయాన్ని ఎత్తిపడుతూ బహుజన బతుకమ్మను నిరంతర ఉద్యమంగా చేపడుతున్నాం. ‘ప్రకృతి వ్యవసాయం–రక్షిత ఫలసాయం’ అనేదే మన నినాదమని చాటుతున్నాం. సార్వభౌమిక వ్యవసాయమే (Sovereign Agriculture) లక్ష్యంగా భావసారూప్యత కలిగిన శక్తులందరితోనూ బహుజన బతుకమ్మ కల్సి నడుస్తుందని పదేళ్ళ మా ఉద్యమ ప్రస్థానాన్ని మరొకసారి గుర్తు చేస్తున్నాం. ఈ ఏటి బహుజన బతుకమ్మ అక్టోబరు 6న ఉ.10గంలకు ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల ప్రాంగణం, సా.4గం.లకు ఆలగడప, మిర్యాలగూడ; అక్టోబరు 7న కడివెండి, జనగామజిల్లా; అక్టోబరు 8న తుర్కయాంజాల్, రంగారెడ్డి జిల్లా; అక్టోబరు 9న గట్టేపల్లి గ్రామం, ప్రకృతి వ్యవసాయ క్షేత్రం (నాగసముద్రం దగ్గర), ధారూర్ మండలం, వికారాబాద్ జిల్లా; అక్టోబరు 10న కొత్తూరు గ్రామం, బొమ్మరాస్ పేట్ మండలం, వికారాబాద్ జిల్లా; అక్టోబరు 11న సిద్దిపేట జిల్లా; అక్టోబరు 12న వేములవాడ, రాజన్న సిరిసిల్ల జిల్లా; అక్టోబరు 13న ఇందూరు తిరుమల నర్సింగ్ పల్లి గ్రామం, మోపాల్ మండలం, నిజామాబాద్ జిల్లా; అక్టోబరు 14న ఆలేరు (యాదాద్రి భువనగిరి జిల్లా) ప్రాంతాల్లో జరుగుతాయి. అక్టోబరు 1 ఉ.11గంలకు ‘తీరు తీరు పువ్వులు బహుజన బతుకమ్మ’ పాట ఆవిష్కరణ, ‘ప్రకృతి వ్యవసాయం–బహుజన బతుకమ్మ’ పుస్తకం ఆవిష్కరణ సారథీ స్టూడియోస్, అమీర్‌పేట్, హైదరాబాదులో జరుగుతాయి.
బహుజన బతుకమ్మ నిర్వహణ కమిటి
Updated Date - 2021-09-30T06:33:25+05:30 IST