ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెట్రో సెస్ నిధులేమయినట్టు?

ABN, First Publish Date - 2021-11-18T09:06:49+05:30

మూడు రాజధానుల నిర్మాణానికి కేంద్రం నిధులు ఇవ్వాలని ముఖ్యమంత్రి ప్రతిపాదిస్తున్నారు. అయితే ఇప్పటికీ అమరావతి సెస్సును పెట్రో ఉత్పత్తులపై వసూలు చేస్తూనే ఉన్నారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మూడు రాజధానుల నిర్మాణానికి కేంద్రం నిధులు ఇవ్వాలని ముఖ్యమంత్రి ప్రతిపాదిస్తున్నారు. అయితే ఇప్పటికీ అమరావతి సెస్సును పెట్రో ఉత్పత్తులపై వసూలు చేస్తూనే ఉన్నారు. మరి ఆ సెస్ ద్వారా ఇప్పటివరకు వసూలు చేసిన నిధులు ఏమయినట్టు? అమరావతిలో ఎటువంటి సహేతుక కారణాలు లేకుండా నిర్మాణాలను ఎందుకు నిలిపివేశారు? నిధులు, విభజన హామీల అమలుకు మన పార్లమెంట్ సభ్యులు ఇప్పటిదాకా పార్లమెంటులో గళం ఎత్తిన దాఖలాలు లేవు. విభజన హామీల అమలుకు ఇప్పటిదాకా మూగనోము పట్టి, కేంద్రం తెచ్చిన అనేక బిల్లులకు బేషరతుగా మద్దతు ఇచ్చి, ఇప్పుడు సదరన్ కౌన్సిల్ సమావేశంలో విభజన హామీలపై పట్టుపడతామని ప్రగల్భించటం హాస్యాస్పదంగా ఉంది. మొదటి నుంచీ ముఖ్యమంత్రి ఢిల్లీలో ఒకలానూ, రాష్ట్రంలో మరోలానూ వ్యవహరించటం వల్లనే కేంద్రం దృష్టిలో చులకన అయ్యాం. ఇప్పటికైనా బాధ్యతాయుతంగా ఆలోచించి అమరావతినే రాజధానిగా అభివృద్ధి చెయ్యాలి. 

గరిమెళ్ళ రామకృష్ణ, ఏలూరు

Updated Date - 2021-11-18T09:06:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising