ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అన్నా నువ్వు చీకటిని మింగే చంద్రుడివే!

ABN, First Publish Date - 2021-04-26T05:53:23+05:30

ఎప్పుడో ఎక్కడో అవినీతి నియంత వంచిత శవం పాడుకున్న చావుపాట వినుంటావు ఊరి చివర కాలువ గట్టుకాడ దగాపడ్డ తలపాగా...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎప్పుడో ఎక్కడో 

అవినీతి నియంత వంచిత శవం పాడుకున్న 

చావుపాట వినుంటావు

ఊరి చివర కాలువ గట్టుకాడ దగాపడ్డ తలపాగా 

ఉరేసుకున్న నయవంచిత కథ కనుంటావు

ఇన్నిజూసి రక్తం మరిగినోడివి రాజ్యమేలకుండా

కారడవులకి కాపయ్యావేందన్నా?


అడవిలో కాదు వెలుపలే మహారణ్యం ఉంది సోదరా!

గన్ను దించి కన్నెత్తి సూడు

రెపరెపలాడే పతాకంలో ధగధగలాడే నీ ప్రతాపాన్ని

జనంలోకొచ్చి ఎగరేసావంటే తిరుగులేని నాయకుడవుతావు

ఎందుకు ఈ నిస్పృహ

ప్రాణం నీదయినా నాదయినా

నీ నిరాశా నిశ్శబ్దం- నాటు తుపాకీలో తూటాగా పేలిన ప్రతిసారి 

                దేశం ఏడుస్తుందన్నా!


కొమ్మ చివర రెమ్మలో ఇరిసిన లేతాకు పాదాల పసిగుడ్డు 

రేపు ఎదిగొస్తే చేతికి ఏమిస్తావు 

బలపమా బల్లెమా....?

తావి తెగిన చెట్టులా

ఇంకా ఎన్ని తల్లిహృదయాలు పేగుతెంచుకుని కుప్పకూలాలి? తేల్చుకో

జనం మనం వనం నిజం - సంఘం సమాజం మిథ్యా

రణంతో రక్తం దానితో న్యాయం శాశ్వతం కాదు 


కట్టుకున్నదీ! మనసుకి అంటుకున్నదీ! 

ఒంటరితనం రుసరుసలనీ! కొండ గడ్డిపూచలతో గుసగుసలనీ!

స్వరాలు చేసుకొని రైక మాటు గుండెల్లో రగిలించుకొని 

ఎడారి పాటొకటి పాడుకుంటూ! 

నీ ఎడబాటు గమనంలో 

ఎండిన కన్నీటి చెలమల్ని పిండుకొని ఏడుస్తుంది

ఇంకా అడవిలోనే ఉంటానంటావా..?


సెలికల్లో గొడ్లు కాసే ఈరిగాడి ఈల పాటలో ఆకలి శ్లోకం

కలుపు తీసే అమ్మ కట్టిన కొమ్మ ఊయల్లో పసికందు ఆక్రందన గేయం

దారుల్లేని తండాల్లో మౌనంగా వీచే చావు సంగీతం

ఈరోజుకు ఏమైనా మారాయా?

ఎన్నేళ్లయింది నువ్వు అడవులపాలయ్యి?

తుపాకులు కాలిస్తే ల్యాండు మైన్లు పూయిస్తే కాదు

అక్షరాలు దిద్దిస్తే చదువుని వెలిగిస్తేనే మనిషికి కొత్త వేకువ


ఏ సమాధులపై సమ సమాజాన్ని కలలుగంటున్నావు

నీ సిద్ధాంతమంతా రుధిర ఋతువు 

తెగించిన తలలు తెగిన ప్రవాహం

సంధ్యా తిలకం మృత్యు ఘోష

వింధ్యా మలయ ప్రళయ శ్వాస

మాంసం ముద్దలు కట్టిన యమపాశం

ఇంకా ఎన్ని శిరస్సులు నేల రాలాలి?

ఇంకా ఎన్ని మొండాలు నేల వాలాలి?

ఏ శాంతి కోసం? ఏ కాంతి కోసం? 

ఈ అశాంతి అంతఃరణక్షేత్రం

వదిలేసి రా అన్నా!


అన్నా నువ్వు చీకటిని మింగే చంద్రుడివే!

నీ వెన్నెల అడవిలో కాదు జనారణ్యంలో కురవాలి

ఇంకా ఆకలి ధూపంలో రగులుతున్న 

దీపాల్లేని గుడారాలు తడవాలి వెలగాలి

అప్పుడే ప్రజాస్వామ్యానికి నిండు పౌర్ణమి


వెంకటేష్‌ పువ్వాడ

72047 09732


Updated Date - 2021-04-26T05:53:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising