ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఒక మరచిపోలేని జ్ఞాపకం

ABN, First Publish Date - 2021-06-12T05:57:05+05:30

ఒక దశాబ్దంన్నర క్రితం (సంవత్సరం సరిగా గుర్తు లేదు) కారా మాస్టారు ఉదయమే ఫోన్‌ చేశారు. నాకు కొంత ఆశ్చర్యం, ఆనందం కలిగింది. ఆయన ప్రతి సంవత్సరం కథా నిలయంలో నిర్వహించే.....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒక దశాబ్దంన్నర క్రితం (సంవత్సరం సరిగా గుర్తు లేదు) కారా మాస్టారు  ఉదయమే ఫోన్‌ చేశారు. నాకు కొంత ఆశ్చర్యం, ఆనందం కలిగింది. ఆయన ప్రతి సంవత్సరం కథా నిలయంలో నిర్వహించే రచయితల సదస్సులో ఒకసారి ప్రారంభోపన్యాసం చేయవలసిందిగా కోరారు. నేను సాహిత్య విద్యార్థిని కానని, నాకు సాహిత్యంలో ఉన్న ప్రవేశం చాలా తక్కువని, రాష్ట్రంలోని ప్రతిష్ఠాత్మకమైన కథా రచయితలనుద్దేశించి ప్రసంగించడానికి నాకు ఆ స్థాయి లేదని అన్నాను. కారా ఎక్కువ వాదించకుండా తనకు వయసు మీద పడిపోతున్నదని బహుశా ఈ సదస్సే తన జీవితంలో చివరి సదస్సు అని అన్నప్పుడు, నేను ఒప్పుకోక తప్పలేదు. ఇది అన్న తర్వాత ఆయన 15, 16 సంవత్సరాలు సంపూర్ణ జీవితం జీవించారు.


సదస్సులో సాహిత్యానికి సమాజానికుండే సంబంధాన్ని సామాజిక శాస్త్ర విద్యార్థిగా నేను ఎట్లా చూస్తానో అన్న అంశం మీద మాట్లాడాను. రచయితలు చాలా మంది ప్రసంగం బాగుందని అన్నారు. సాయంత్రం నా తిరుగు ప్రయాణం కొరకు కారా గారి దగ్గరకు వెళ్ళి ‘నేను వెళ్ళిపోవాలి’ అని చెప్పితే ‘ఇవ్వాళ మీ ప్రసంగానికి చాలా పొగడ్తలు వచ్చాయి, మీరు జాగ్రత్తగా ఉండాలి’ అని ఒక స్నేహపూరిత సలహా ఇచ్చారు. నేను ఎప్పుడు ఎక్కడ ప్రసంగం చేసినా ఎందుకో కారాగారి హెచ్చరింపు గుర్తు వస్తుంటుంది. ఇది ఒక జీవిత కాల జ్ఞాపకంగా మిగిలింది.


– ప్రొ. జి.హరగోపాల్‌

Updated Date - 2021-06-12T05:57:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising