ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లవ్ అఫైర్ ఫలితం: యువకునికి ఘోర శిక్ష

ABN, First Publish Date - 2021-10-04T22:48:47+05:30

ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావో జిల్లాలో దారుణం జరిగింది. ఇంటి వరండాలో నిద్రపోతున్న 20 ఏళ్ల యువకుడి జననాంగాలను

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాన్పూరు: ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావో జిల్లాలో దారుణం జరిగింది. ఇంటి వరండాలో నిద్రపోతున్న 20 ఏళ్ల యువకుడి జననాంగాలను గుర్తుతెలియని వ్యక్తులు తెగ్గోశారు. స్థానికంగా కలకలం రేపిన ఈ ఘటన కలకలం రేపింది. జననాంగాలు కోసేయడంతో బాధతో విలవిల్లాడుతున్న యువకుడి అరుపులు విన్న కుటుంబ సభ్యులు ఇరుగుపొరుగువారు అక్కడికొచ్చి చూసి షాకయ్యారు. జననాంగం తెగిపోయి, రక్తపు మడుగులో బాధతో కేకలు వేస్తున్న అతడిని చూసిన వెంటనే పోలీసు కంట్రోలు రూముకు సమాచారం అందించారు.


వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న మౌరావన్ పోలీసులు బాధిత యువకుడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అతడి పరిస్థితిని చూసిన అక్కడి వైద్యులు లక్నోలోని ట్రామా సెంటర్‌కు రెఫర్ చేశారు. మౌరావన్ పోలీస్ స్టేషన్  పరిధిలోని గౌరి మజ్రె పరా గ్రామంలో జరిగిందీ ఘటన.


గ్రామానికి చెందిన సూరజ్ వరండాలో నిద్రపోతుండగా ఆదివారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు కొందరు వచ్చి తొలుత సూరజ్‌పై దాడిచేశారు. ఆ తర్వాతి అతడి జననాంగాన్ని కోసి పరారయ్యారు.


కుమారుడి అరుపులు విన్న తల్లి పుష్ప వెంటనే బయటకు వచ్చి చూసి విస్తుపోయింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. అయితే, ఈ ఘటనకు ప్రేమ వ్యవహారం కారణమై ఉండొచ్చని స్థానికులు చెబుతున్నారు. దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.

Updated Date - 2021-10-04T22:48:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising